విజయనగరం

బాబోయ్.. పందులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 10: పట్టణంలో పందుల సంచారం విపరీతంగా పెరగడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పందులకు ఉత్పత్తి కేంద్రంగా విజయనగరం ఉందని, పందుల సంచారాన్ని నిర్మూలించాలని రెండేళ్ల క్రితం కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ఆదేశించారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులలో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. కేంద్రమంత్రి అశోక్ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు పందుల సంచారాన్ని నిర్మూలించడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారు. పందుల పెంపకందారులతో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి తమ పని పూర్తయిందని అనిపించుకున్నారు. పట్టణంలో ఉన్న 40 వార్డులలోను పందులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని, దీనివల్ల పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలలో పాలకవర్గ సభ్యులు సైతం గగ్గోల పెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మురుగునీటి కాలువలలో పందులు తిష్ట వేయడం , పేరుకుపోయిన చెత్తా చెదారం వల్ల దోమల బెడద విపరీతంగా పెరగడం వల్ల మలేరియా, ఫైలేరియా వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన విజయనగరం పట్టణంలో ఒకవైపుఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మరోవైపుజిల్లా అధికారులు, ఇతర ప్రముఖులు నివశిస్తున్నప్పటికీ, మారుమూల పల్లెలలో ఉన్న మాదిరిగా పందుల సంచారం పెరగడం పలువురిని విస్మయం కలిగిస్తోంది. దోమల నియంత్రణ కొనుగోలు చేసిన ప్యాగింగ్ యంత్రం మూలన పడింది. మరమ్మతులకు గురైన వాహనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు ఏమాత్రం శ్రద్ద చూపడం లేదు. ఇప్పటికైనా దీనిని వినియోగంలోకి తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.