విజయనగరం

ఆర్టీసీ నష్టాలకు అధికారుల ఏకపక్ష నిర్ణయాలే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 23: ఆర్టీసీ నష్టాలకు అధికారుల ఏకపక్ష నిర్ణయాలే కారణమని ఎంప్లారుూస్ యూనియన్ సహాయ ప్రధాన కార్యదర్శి వైవి రావుఅన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ డిస్పెన్సరీ కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్రిభజన తర్వాత ఆర్టీసీలో అప్పటికే ఎక్కువగా ఉన్న అధికారుల సంఖ్యను తగ్గించకుండా యాజమాన్యం అందుకు విరుద్ధంగా కొత్త పోస్టులను సృష్టించి అధికారుల సంఖ్యను అన్నిస్థాయిల్లో పెంచిందన్నారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాకపోయినప్పటికీ, సంస్థలో నష్టాలు తగ్గాలంటే కార్మికుల తగ్గింపే లక్ష్యంగా యాజమాన్యం వ్యవహరిస్తుందని ఆరోపించారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్టీసీలో తక్కువ ఆదాయం వస్తున్న రూట్లలో తిరుగుతున్న సిబ్బంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్స్‌ల్లో మార్పులు చేయకుండా అధికారులు ఇష్టారాజ్యంగా షెడ్యూల్స్‌లను మార్చుతున్నారని తెలిపారు. ఆయా రూట్లలో తక్కువ ఆదాయం వస్తుందని షెడ్యూల్స్‌ను తొలగించి, సిబ్బందిని కుదిస్తున్నారని ఆరోపించారు. షెడ్యూల్స్ కుదింపుతో సిబ్బంది ఎక్కువగా ఉన్నారన్న సాకుతో వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేస్తున్నారని తెలిపారు. ఈ నేపధ్యంలో కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 27, 28తేదీల్లో అన్ని డిపోలలో ధర్నాలు, నల్లబ్యాడ్జీలతో నిరసనలను చేపడతామని తెలిపారు. ఈ మేరకు వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షుడు వెంకటరావు, రీజనల్ కార్యదర్శి భానుమూర్తి పాల్గొన్నారు.