విజయనగరం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 23: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి వైవిరావు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని కోరారు. స్ధానిక ఆర్టీసీ కార్యాలయంలో ఆదివారం నార్త్‌ఈస్ట్‌కోస్టల్(నెక్) రీజనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం మనరాష్ట్ర ఆర్టీసీకి రావాల్సిన న్యాయపరమైన ఆస్తుల వాటాను ఇప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలవల్ల ఆర్టీసీ నష్టాలబాటలో నడుస్తోందన్నారు. ఆర్టీసీ గుర్తింపుకార్మిక సంఘం ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో రాష్టస్థ్రాయి గుర్తింపు పొందిన ఎన్‌ఎంయు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు. వేతనాల సవరణకు సంబంధించి కార్మికులకు రావల్సిన ఎరియర్స్‌పై ఇచ్చిన బాండ్లను, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బాండ్లను రద్దు చేయించి గెలిచిన వెంటనే క్యాష్ ఇప్పిస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరడం లేదన్నారు. 22 సంవత్సరాల సర్వీసు దాటిన ఉద్యోగులకు ఆటోమెటిక్ ప్రమోషన్స్ ఇప్పిస్తామని, అద్దెబస్సులను, ఒటి డ్యూటీలను, గ్రౌండ్ బుకింగ్‌లను రద్దు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎన్‌ఎంయు నాయకులు గుర్తింపులోకి వచ్చి ఏడునెలలు గడుస్తున్నా హామీల కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ, జోనల్ అధ్యక్షుడు సిహెచ్.వెంకటరావు, రీజనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి, యూనియన్ నాయకులు బిఎల్ నారాయణ, శర్మ, అన్నపూర్ణ పాల్గొన్నారు.