విజయనగరం

సమాజ సమస్యలపై పోలీసుల దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 13: జిల్లాలో పోలీసుల పనితీరు మెరుగుపడింది. ప్రజలకు చేరువయ్యేందుకు పోలీసులు తమ పంథాను మార్చుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్‌కెవి రంగారావు వచ్చిన తరువాత పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలపై దృష్టిసారించారు. పోలీసులు తమ విధులతోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్పీ ఆదేశించడంతో అన్నిచోట్ల ఎస్సైలు ఆయా మండల పరిధిలోని గ్రామాలను సందర్శించి అక్కడ సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు తమదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఇటీవల చీపురుపల్లి ఎస్సై క్రాంతికుమార్ మెట్టపల్లి, సారిపల్లి గ్రామాలను సందర్శించినప్పుడు అక్కడ రైతులు గ్రామానికి తోటపల్లి కాలువ నీరు రావడంలేదని, వర్షాలు పడితే గెడ్డల్లో పూడిక పెరిగి పంటలు మునిగిపోతున్నాయని తెలుపగా తోటపల్లి ఎస్‌ఇతో మాట్లాడి సమస్యను పరిష్కరించగలిగారు. అదేవిధంగా బొబ్బిలి ఎస్సై అమ్మినాయుడు ఆ మండలంలోని పాతపెంట, బొడ్డవలస గ్రామాలను సందర్శించినప్పుడు గ్రామస్థులు బోర్లు పనిచేయడం లేదని తెలుపగా వాటిని ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. పాఠశాలల్లో పేకాట ఆడటం, మందుబాబుల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని తెలుపగా ఆ సమస్యను పరిష్కరించారు. ఇదిలా ఉండగా బొండపల్లి మండలం బి.రాజేరులో శ్మశాన రహదారి కోసం బిసిలు, ఎస్సీలకు మధ్య గత కొనే్నళ్లుగా వివాదం నెలకొనగా దానిని అక్కడ ఎస్సై తారకేశ్వరరావు, తహశీల్దార్ నీలకంఠేశ్వరరావు పరిష్కరించగలిగారు. ఈ విధంగా జిల్లాలోని నలుమూలల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోలీసులు స్పందిస్తూ తమదైన శైలిలో వాటిని పరిష్కరిస్తున్నారు.
ఇదే విషయమై ఎస్పీ ఎల్‌కెవి రంగారావు వద్ద ప్రస్తావించగా పోలీసులలో పరివర్తన తీసుకురావడానికి తాను అన్నివిధాల కృషి చేస్తున్నామన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. అందుకు జూట్‌మిల్లులను సక్రమంగా నడపాలని జిల్లాలోని అన్ని జ్యూట్‌మిల్లుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి వారిని ఒప్పించగలిగామన్నారు.