విజయనగరం

బాలలను కాపాడటం అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 18: సమాజంలో బాలలను కాపాడటం అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ కాళిదాసు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో నేచర్ చైల్డ్‌లైన్ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలను ఎవరైనా వేదిస్తే పోక్సో యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇదిలా ఉండగా ఆపదలో ఉన్న పిల్లలు చైల్డ్‌లైన్ నిర్వహించే 1098కు సమాచారం అందిస్తే వారికి చేయూతనిస్తుందన్నారు. జాతీయ స్థాయిలోనే చైల్డ్‌లైన్ సంస్థ బాలల రక్షణకు పనిచేస్తుందన్నారు. అనంతరం చైల్డ్‌లైన్ సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో విజయనగరం నేచర్ కొలాబ్ ఆర్గనైజేషన్ సెంటర్ కోఆర్డినేటర్ బంగారుబాబు పాల్గొన్నారు.