విజయనగరం

చెరకు రైతుల నుండి ప్రభుత్వం ఎటువంటి లాభం ఆశించడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి, డిసెంబర్ 5: చెరకు రైతుల నుండి ప్రభుత్వం ఎటువంటి లాభం ఆశించడంలేదని రాష్ట్ర చక్కెర కర్మాగారం కమిషనర్ ఎల్. మురళి అన్నారు. సోమవారం ఆయన భీమసింగి చక్కెర కర్మాగారం పరిశీలనకు వచ్చి కలసిన విలేఖరులతో మాట్లాడుతూ చక్కెర కర్మాగారాల పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు పన్ను చెల్లింపుతోపాటు వ్యాట్‌ట్యాక్స్‌ను రద్దుచేసిందన్నారు. రైతులు చెరకును అభివృద్ధి చేసినప్పుడే ఫ్యాక్టరీలు అభివృద్ధి పథంలో నడుస్తాయని తెలిపారు. రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా చక్కెర కర్మాగారాలను ఆర్థికంగా ఆదుకునే పరిస్థితులు లేవని తెలిపారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలకు రూ. 23 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న కర్మాగారాలలో భీమసింగి చక్కెర కర్మాగారం ఒక్కటే చెరకు రైతులకు బకాయిలు లేకుండా చెల్లింపులు చేయగలిగిందన్నారు. ఫ్యాక్టరీ అన్ని విషయాలను మేనేజింగ్ డైరెక్టర్ డి.నారాయణరావు తమకు వివరించారని తెలిపారు. రైతులు, ప్రాంత నాయకులు తెలిపిన సమస్యలను ముఖ్యమంత్రికి వివరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటరావు, బొబ్బిలి ఎపిసి ముత్యాలు పాల్గొన్నారు.

ఎన్‌ఎంఆర్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
* ఎఐటియుసి నాయకుడు కృష్ణంరాజు వెల్లడి
జామి, డిసెంబర్ 5: ఎన్‌ఎంఆర్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఎఐటియుసి సీనియర్ నాయకుడు వి.కృష్ణంరాజు డిమాండ్ చేశారు. సోమవారం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించేందుకు వచ్చిన చక్కెర కమిషనర్ మురళిని కలసి కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వినతిపత్రం ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్కువ మంది కార్మికులతో ఫ్యాక్టరీని నడిపిస్తున్నారని, దీనివలన కార్మికులకు పనిభారం పెరిగిపోయిందన్నారు. ఎన్నోయేళ్లుగా పనిచేస్తున్న కార్మికులను నేటికి పర్మినెంట్ చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రీజనల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఖాళీగా ఉన్న పర్మినెంట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్మికులకు అవసరమైన వౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు