విజయనగరం

అపరిష్కృత రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 5: జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.జితేంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి తహశీల్దార్లు, ఎంపిడిఒలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాసాధికార సర్వే ఏ మేరకు చేశారో అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్లు, ఎంపిడిఒలు సమన్వయంతో పనిచేసి ప్రజాసాధికార సర్వే వేగవంతమయ్యేలా చూడాలన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలద్వారా దిగుబడులు పెంచి వ్యవసాయ రంగంలో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చేలా కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ భవన నిర్మాణాలను గ్రామ పంచాయతీలు, ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో చేపట్టిన కన్జర్వేటివ్ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి ప్రశాంతి పాల్గొన్నారు.

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
* వికటించిన ప్రేమాయణం
* కెజిహెచ్‌కు తరలింపు
విజయనగరం, డిసెంబర్ 5: ప్రేమలో విఫలమైన డిగ్రీ విద్యార్థిని కలెక్టరేట్ గేటు వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆమెను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మక్కువ మండలం కంటేరువలసలోని కొయ్యానపేటకు చెందిన పి.ప్రసన్న బొబ్బిలిలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఈమె రాజాన సుధాకర్‌ను ప్రేమించినట్టు పేర్కొంది. అయితే ప్రియుడు పెళ్లికి అంగీకరించక పోవడంతో ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కాగా, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో ఆమెను విశాఖలోని కెజిహెచ్‌కు తరలించారు. ఇదిలాఉండగా బాధితురాలి వెంట వన్‌టౌన్ ఎస్సై గోపాలకృష్ణ, కానిస్టేబుల్‌ను విశాఖకు పంపించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.