విజయనగరం

గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 5: జిల్లాలో గృహనిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహనిర్మాణ శాఖపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు నియోజకవర్గాల నుంచి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు రాలేదన్నారు. మరో నాలుగు రోజుల్లో ఆయా నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు రాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు ఇస్తామని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలాఉండగా ప్రస్తుతం కేటాయించిన ఇళ్లను లబ్ధిదారులు పూర్తి చేసుకోకపోతే వెనక్కిపోతాయని స్పష్టం చేయాలన్నారు. నియోజకవర్గాలకు కేటాయించిన ఇళ్లలో మూడు శాతం ఇళ్లను విభిన్న ప్రతిభావంతులకు కేటాయించాలన్నారు. మైనారిటీలకు కేటాయించిన వాటిలో వారు లేకపోతే ఇతరులకు కేటాయించాలన్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద 10,500 గృహాలు మంజూరుకాగా, వాటిలో 7500 గృహాలకు మంజూరు ఉత్తర్వులు అందజేశామన్నారు. కాగా, ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం వేగవంతమయ్యేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటికి వారం రోజులపాటు వారోత్సవాలు జరిపి ఈనెల 14వతేదీలోగా పునాదులు వేయించాలన్నారు. ఎమ్మెల్యేలు, గృహనిర్మాణశాఖ ఇంజనీర్లు కలసి లబ్ధిదారులకు అవగాహన నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద మంజూరైన 2296 గృహాలకు వెయ్యి గృహాలు గ్రౌండింగ్ పనులు చేశారని, మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా జిల్లాకు కేటాయించిన నిధులు ఖర్చు చేయాలన్నారు.
ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద 6641 మంజూరు చేశామని, గ్రౌండింగ్ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఎన్టీఆర్ అప్‌గ్రెడేషన్ పథకం కింద 923 పాత ఇళ్లకు మరమ్మతులు మంజూరు కాగా, 648 మంది ఉపసంహరించుకున్నారని అన్నారు. ఐఎవై పథకం కింద 4163 గృహాలు మంజూరు కాగా, 3716 గృహాలు పూర్తి చేశారని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హుదూద్ తుపాను కింద మంజూరైన 1365 గృహాలకు గ్రౌండింగ్ చాలా తక్కువగా ఉందని, మంచి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని మృణాళిని ఆదేశించారు. బిపిఎల్ కింద 21252 గృహాలు మంజూరు కాగా, లబ్ధిదారుల ఎంపిక, డేటా ఎంట్రీ పనులు మాత్రమే పూర్తయ్యాయని, నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐఎవై ఇళ్లను వేగంగా నిర్మించుకోకపోతే వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ గృహనిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలన్నారు. భూ సమస్య ఉంటే తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ సిమెంట్, ఇనుము ధరలు పెరిగినందున లబ్ధిదారులు ముందుకు రావడం లేదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సంధ్యారాణి, ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, జెడ్పీ వైస్ చైర్మన్ బి.కృష్ణమూర్తి, పిడి మూర్తి పాల్గొన్నారు.