విజయనగరం

తేరుకోలేని నష్టాలలో ఆర్టీసీ విజయనగరం రీజియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 8: సరైన ప్రణాళిక లేకపోవడం.. సమయపాలన పాటించకపోవడం.. ప్రైవేటువాహనాల జోరు పెరగడం.. గ్రామీణ రూట్ల పట్ల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ విజయనగరం నార్త్‌ఈస్ట్‌కోస్టల్ రీజియన్ తేరుకోలేని నష్టాలతో నడుస్తోంది. ప్రతీయేటా నష్టాలు పెరుగుతుండటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కిలోమీటరుకు అయిదు రూపాయల మేరకు నష్టం రావడంతో ఏమిచేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ రీజియన్ ఉనికికే ప్రమాదం వల్లే అవకాశం కనిపిస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తొమ్మిది డిపోలకు ఈ రీజియన్ విస్తరించి ఉంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో అధికారులు బాగా వెనుకబడి ఉన్నారు. ఈ కారణంగా ప్రజల ఆదరణకు దూరమవుతున్నారు. రీజియన్ పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 3,886 గ్రామాలు ఉండగా, 2,130 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. కేవలం 1756 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంది. ఇందులో విజయనగరం జిల్లాలో 1593 గ్రామాలు ఉండగా 646 గ్రామాలకు, శ్రీకాకుళం జిల్లాలో 2293 గ్రామాలు ఉండగా, 1107 గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించారు. మిగతా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించకపోవడం వల్ల ఆర్టీసీ బస్సు ప్రయాణానికి దూరమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేయడం వల్ల ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లే ప్రైవేటు వాహనాలను నియంత్రించడంలో ఆర్టీసీ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రతీరోజూ లక్షలాది రూపాయల ఆర్టీసీ ఆదాయానికి గండి పడటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఈ రీజియన్‌లో నష్టాలకు కళ్లెం వేసే మార్గాలు తెలియక అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని రీజియన్‌ల కంటే అత్యధిక నష్టాలతో నడుస్తున్న రీజియన్‌లలో విజయనగరం రీజియన్ ముందంజలో ఉంది. ప్రధానంగా రీజనల్ ప్రధాన కేంద్రంలో ఉన్న రీజనల్‌మేనేజర్ సరైన మార్గదర్శిక సూత్రాలు జారీ చేయకపోవడం, బస్సుల రాకపోకలు, ఆదాయ మార్గాలపై దృష్టి సారించకపోవడం, నష్టాలు తగ్గించే అంశాలపై తగిన సలహాలు, సూచనలు ఇవ్వకపోవడం వల్ల ప్రతీరోజూ ఆక్యుపెన్సీరేషియో (ఒఆర్) తగ్గిపోతోంది. ఫలితంగా రీజియన్ ప్రతీయేటా నష్టాలను చవిచూస్తోంది. ముఖ్యంగా రీజనల్‌మేనేజర్ తీరుపై దిగువస్థాయి అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ రీజియన్ పరిధిలో 794 బస్సు సర్వీసులు ఉండగా, ఇందులో విజయనగరం జిల్లాలో 362 బస్సులు, శ్రీకాకుళం జిల్లాలో 432 బస్సులు ఉన్నాయి. మొత్తం 794 బస్సు సర్వీసులు ప్రతీరోజూ 3.6 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 4.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు తొమ్మిది డిపోలలో 34.82 కోట్ల రూపాయల నష్టం రాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 55.54 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఎనిమిది నెలల వ్యవధిలో 20.72 కోట్ల రూపాయల నష్టం పెరిగింది. గత నాలుగేళ్ల నుంచి క్రమేపీ నష్టాలు పెరగడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 2012-2013 సంవత్సరంలో 20.39 కోట్లు, 2013-2014లో 50.03 కోట్లు, 2014-2015లో 60.35 కోట్లు, 2015-2016లో 54.37 కోట్ల రూపాయల నష్టం రాగా, ఈ ఏడాది ఇంతవరకు 55.54 కోట్ల రూపాయల మేరకు నష్టం వచ్చింది. డిపోల వారీగా నష్టాలను పరిశీలిస్తే విజయనగరం డిపోలో 6.87 కోట్లు, ఎస్.కోట డిపోలో 5.30 కోట్లు, సాలూరు డిపోలో 5.37 కోట్లు, పార్వతీపురం డిపోలో 5.60 కోట్లు, శ్రీకాకుళం డిపో-1లో 6.27 కోట్లు, శ్రీకాకుళం డిపో-2లో 9.67 కోట్లు, పలాస డిపోలో 5.78 కోట్లు, టెక్కలి డిపోలో 5.31 కోట్లు, పాలకొండ డిపోలో 5.26 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ నేపధ్యంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య శుక్రవారం విజయనగరం రీజియన్‌లో పర్యటించనున్నారు. దీంతో ఏమిచేయాలో తెలియక అధికారులు సతమతం అవుతున్నారు.