విజయనగరం

సంగీత కళాశాలకు 97 ఏళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 8: సంగీతం విశ్వజనీనం. సంగీతానికి భాషా, బేధం లేదు. అందువల్లనే పాశ్చాత్యులు కూడా భారతీయ నృత్యాలపట్ల ఆకర్షితులవుతున్నారు. పూర్వం సంగీతంతో జబ్బులు నయం చేసేవారని నానుడి కూడా ఉంది. మనస్సుకు ఆహ్లాదం కలిగించే సంగీతం వింటే ఎవరికైనా సాంత్వన చేకూరుతుంది. అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఎంతో ఇష్టపడేది సంగీతం తరువాత నాట్యం. నాట్యకళ వైద్యపరంగా ఎంతో విశిష్టమైనది. మనస్సును, దేహాన్ని ఉత్సాహంగా ఉంచే శక్తి ఇందులో ఉంది. నాట్యంద్వారా అనేక శారీరక రుగత్మల నుంచి ఉపశమనం పొందవచ్చని నిరూపణ అయింది. మనసు ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండటానికి కూడా ఈ కళ ఎంతగానో సహాయపడుతుంది. అటువంటి సంగీత, నృత్యకళల్లో ఎందరో మహానీయులను అందజేసిన విజయనగరం మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల మరో రెండేళ్లలో శతవసంతాలు జరుపుకోనుంది. వచ్చే ఏడాది జనవరి 11వతేదీన డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా వెబ్‌సైట్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రోజున మహా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ పరశురాం తెలిపారు.
విజయనగరం నడిబొడ్డున, కోటకు వెనుకభాగాన ‘విజయరామ గాన పాఠశాల’ అనే పేరుతో ఫిబ్రవరి 5, 1919న విజయరామరాజు పాఠశాలను ప్రారంభించారు. ఈ గాన పాఠశాల 1953లో కళాశాలగా అభివృద్ధి చెందింది. సంగీత కళాశాల ఏర్పడక పూర్వం ఆ భవనాన్ని టౌన్‌హాలుగా ఉపయోగించేవారు. అందులో సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కలిగించేందుకు వివిధ నాటికలు, కచేరీలు నిర్వహించేవారు. అయితే గాన పాఠశాలగా ఏర్పడిన ఈ సంగీత కళాశాల దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమ కళాశాలగా చెప్పవచ్చును. సంగీత కళాశాల ఇక్కడ ఏర్పాటుచేసిన తరువాత మద్రాసులో ఏర్పాటుచేశారు.విజయరామరాజు అంతరంగికునిగా ఉన్న చాగంటి జోగారావు పంతులు కుమారుడు గంగరాజు అంధుడని తెలుసుకొని ఆ చిరంజీవికి సంగీత విద్య నేర్పిస్తే బాగుంటుందని, అతనితోపాటు తరతరాల వరకు సంగీత విద్యావ్యాప్తి జరుగుతుందనే సత్సంకల్పంతో విజయరామ గాన పాఠశాలను ప్రారంభించారు. ఆదిభట్ల నారాయణదాసు అధ్యక్షులు, ద్వారం వెంకటస్వామినాయుడు వయొలిన్ ఆచార్యులు, కట్టా సూర్యనారాయణ, వాసా వెంకటరావు వీణాచార్యులు, పేరి రామమూర్తి గాత్ర అధ్యాపకులుగా ఉండేవారు. తంజావూర్ మునిస్వామి పిళ్లే నాద స్వరానికి, తంజావూరు గోవిందరాజు పిళ్లే భరత నాట్యానికి ఆచార్యులు. మృదంగంతో లింగం లక్ష్మాజీ అప్ప అధ్యాపకులు విద్యార్థులకు ఉచిత వసతి భోజన సదుపాయాలు కల్పించేవారు. దీంతో మన రాష్టమ్రే గాకుండా తమిళనాడు నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి విద్యాభ్యాసం చేసేవారు.
రాష్ట్రంలో మొట్టమొదటగా విజయనగరంలోని సంగీత కళాశాలను ఏర్పాటు చేయడం విశేషం. రాష్ట్రంలో విజయనగరంతోపాటు రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, తెలంగాణాలో వరంగల్, మంతెన, నిజామాబాద్, హైదరాబాద్‌లో రెండు, సికింద్రాబాద్‌లో ఇటువంటి సంగీత కళాశాలలు పనిచేస్తున్నాయి. ఇక్కడ కళాశాల ద్వారా వివిధ కోర్సులకు సర్ట్ఫికేట్ కోర్సు, డిప్లమో కోర్సులను అందిస్తున్నాయి. గాత్రం, వీణా, వయోలిన్, మృదంగం, భరతనాట్యం, నాధస్వరం, డోలు వంటి అంశాల్లో శిక్షణనిస్తున్నారు. కళాశాల ఆవిర్భావ సమయంలో గురు సాంప్రదాయం ప్రకారం విద్యను నేర్చుకునేందుకు శిష్యులు తిరిగేవారు. నేడు స్పీడ్ యుగంలో విద్యార్థుల కోసం కళాశాలలు ఎదురు చూస్తున్నాయి. పూర్తి సమయం వెచ్చించే విద్యార్థులు దొరక్కపోవడంతో పార్ట్ టైం కింద కళాశాల పనివేళలను మార్పు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర, తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు కళాశాల పనిచేస్తుంది.

ఎత్తిపోతల పథకం స్థల పరిశీలన
చేసిన కలెక్టర్
పాచిపెంట, డిసెంబర్ 8: మండలంలో కేశలి ఎత్తిపోతల పథకానికి మూడు కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరు కావడంతో స్థలాన్ని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, పార్వతీపురం ఐటిడిఎ పిఒ లక్ష్మిశ గురువారం కేశలి సమీపాన పెద్దగెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ ఎత్తిపోతలపథకం నిర్మాణంతో ఎంతమంది రైతులు లబ్ధి పొందుతారో, సాగు విస్తీర్ణం ఎంత, స్థలం అనుకూలమా కాదా తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. కొటికిపెంట, కేశలి గ్రామాలకు చెందిన 425 ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని ప్రాజెక్టు ఇఇ కృపాసింగ్ తెలిపారు.
కలెక్టర్ దృష్టికి సమస్యలు : ప్రాజెక్టు స్థల పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ వివేక్ దృష్టికి మండల పరిధిలోని పలు సమస్యలను స్థానికులు తీసుకువచ్చారు. పెద్దగెడ్డ నిర్మాణం పూర్తయి ఏడేళ్లయినా నేటికీ కొటికిపెంట గ్రామంలో గృహ నిర్మాణాలు జరగలేదని జెడ్పీటిసి సభ్యురాలు సలాది అనూరాధ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఒక్కో గృహానికి కేటాయించిన నిధులు మళ్లీ తిరిగి వెళ్లిపోయాయని తెలిపారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని ఆమె కోరారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన యువతకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని గుర్తుచేశారు. పెద్దగెడ్డ ఎడమ కాలువ నిర్మాణం చేపట్టాలని, అరుకు-బంగారుగుడ్డి రోడ్డు పనులు పూర్తిచేయాలని, మడవలస నిర్వాసితులకు కేటాయించిన భూములను అప్పగించాలని సిపిఎం మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు వినతిపత్రం సమర్పించారు.