విజయనగరం

చెక్కులకు పెరుగుతున్న డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 8: నిన్న, మొన్నటివరకు అన్నింటికి నగదును చెల్లించిన వినియోగదారులు నేడు చెల్లింపులకు చెక్కు పుస్తకాలపై ఆధారపడుతున్నారు. చెక్కు పుస్తకాల కోసం ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తున్నాయని ఎల్‌డిఎం గురవయ్య తెలిపారు. ప్రభుత్వం ఇటీవల అన్ని లావాదేవీలను నగదు రహితంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఎక్కువ మంది ఎటిఎంలు, చెక్కు పుస్తకాలపై లావాదేవీలు జరుపుతున్నారన్నారు. మరోపక్క చెక్కులపై ఎంత మొత్తంనైనా లావాదేవీలు జరుపుకొనే వీలుండటంతో పెళ్లిళ్లు జరుపుకొనేవారు కల్యాణ మండపాలకు, బ్యాండ్ పార్టీలకు, పెద్ద మొత్తంలో వస్త్రాలు కొనుగోలు తదితర వాటికి చెక్కులను అందజేస్తున్నారు.
గతనెల 28వతేదీ నుంచి జిల్లాలో పెద్దయెత్తున వివాహాలు జరుగుతున్నాయి. కల్యాణ మండపాలన్నీ రద్దీతో కనిపిస్తున్నాయి. ఏ చిన్నపాటి మొత్తానికైనా చెక్కులను ఇవ్వాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. ఇక ఉద్యోగుల్లోనూ చెక్కుల వాడకం పెరిగింది. గతంలో వివిధ సంక్షేమ శాఖల్లో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్న నగదు చెల్లించేవారు. ఉదాహరణకు సర్వశిక్ష అభియాన్ ద్వారా గ్యాస్ చెల్లింపులకు ఎవరికి వారుగా నగదు చెల్లించేవారు. నేడు అన్నింటికీ కలిపి ఒకే గ్యాస్ కంపెనీ కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో ఒకే చెక్కు చెల్లిస్తున్నామని ఎస్‌ఎస్‌ఎ పిఒ లక్ష్మణరావు తెలిపారు. అలాగే స్టేషనరీ కొనుగోళ్లకు కూడా ఇదే పద్ధతిని అవలంభించనున్నట్టు చెప్పారు. ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంకు, విశాఖ గ్రామీణ బ్యాంకు వాటికి చెక్కు పుస్తకాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. ఇకముందు చెక్కు పుస్తకాలను బ్యాంకులు పెద్ద సంఖ్యలో సరఫరా చేయాల్సి వస్తుంది.

కోట్లాది రూపాయల జాగా..
పేదలు పాగా

విజయనగరం, డిసెంబర్ 8: మున్సిపాలిటీ ఆస్థులు అన్యాక్రాంతం కాకుండా చూడటంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పట్టణంలోని కంటోనె్మంట్ బజారులో దాదాపు 40 దుకాణాలలో పేదలు పాగా వేశారు. అత్యంత విలువైన ఈ స్థలంలో పేదలు తిష్ట వేసినా మున్సిపల్ అధికారులు అటువైపు కనె్నత్తి చూడటం లేదు. ఇప్పటికే అందులో కొందరికి గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ వారు మాత్రం ఇక్కడే తిష్ట వేశారు. కనీస సదుపాయాలు లేకపోయినా కోట్లాది రూపాయల విలువైన జాగా కావడంతో అక్కడ వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉండగా స్వచ్ఛ్భారత్ కోసం ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ అక్కడ నివాసం ఉన్న 40 ఇళ్లకు ఏ ఇంటికి మరుగుదొడ్డి లేదు.
సదుపాయాలు కల్పించండి : ఎన్నోయేళ్లుగా మేం ఇక్కడ నివాసం ఉంటున్నామని స్థానికులు చెబుతున్నారు. కనీసం విద్యుత్, కాలువలు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని నివాసమున్న మహిళలు చెప్పారు. గతంలో మున్సిపాలిటీకి పన్నులు చెల్లించామని, ఇప్పుడు మా దగ్గర నుంచి పన్నులు తీసుకోవడం లేదన్నారు. ఆ ప్రాంతంలో కూడా కాలువలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.