విజయనగరం

‘వ్యాపారులు ఇ-పోస్ యంత్రాలు వినియోగించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరివిడి (చీపురుపల్లి), డిసెంబర్ 8: నగదు రహిత లావాదేవీల నిమిత్తం వ్యాపారులు సిద్ధం కావాలని సిటిఒ వై.విజయభాస్కరరావు అన్నారు. గురువారం చీపురుపల్లి వైశ్య వర్తక భవనంలో గరివిడి, చీపురుపల్లి మండలాల వ్యాపారులు, డీలర్లతో ఆయన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ-పోస్ యంత్రాలను వ్యాపార లావాదేవీలు నిర్వహించడం వల్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురుకావని, వీటిపై అపోహలు వద్దని వివరించారు. చిల్లర సమస్యను అధిగమించేందుకు వ్యాపారులు ఇ-పోస్ యంత్రాలకు అలవాటుపడాలన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్‌టి విధానం అమల్లోకి వచ్చినందున ప్రతి వ్యాపారి, డీలరు తమ మెయిల్ ఐడిలను అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపవాణిజ్య పన్నుల అధికారి జానాదేవ్, వైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు టి.రామకృష్ణ, కార్యదర్శి ఎస్‌విజె శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు కింతలి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గరివిడి, చీపురుపల్లికి చెందిన ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్, కెనరా బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఇ-పోస్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించారు.

ఇళ్ల నిర్మాణానికి స్థల పరిశీలన
నెల్లిమర్ల, డిసెంబర్ 8: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని సర్వే నెం.320 స్థలం ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉంటుందని జెడ్పి సిఇఒ నగర పంచాయతీ ప్రత్యేక అధికారి రాజకుమారి అన్నారు. గురువారం ఆమె జి -ప్లస్ 2 ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన సర్వే నంబర్ల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు లెంక అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ స్థలం జన నివాసాలకు దూరంగా ఉందని, జ్యూట్ మిల్లు లీజు స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపడితే సౌకర్యంగా ఉంటుందని సిఇఒ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రాజకుమారి మాట్లాడుతూ జ్యూట్ మిల్లు లీజు స్థలం కోర్టు వివాదంలో ఉందని, సర్వే నెం.57, 58లోని స్థలం తారకరామ నిర్వాసిత గ్రామం కోరాడపేటకు కేటాయించామని చెప్పారు. అందువలన జి-ప్లస్ 2 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ స్ధలాలు అందుబాటులో లేవన్నారు. సర్వె నెం.320 స్థలాన్ని వేగంగా చదును చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ చిన్నారావు, కమిషనర్ అచ్చింనాయుడు, టిడిపి నాయకులు బైరెడ్డి నాగేశ్వరరావు పాల్గొన్నారు.