విజయనగరం

భంజ్‌దేవ్ కుల ధ్రువీకరణ కేసులో పిఒకు కోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, డిసెంబర్ 8: మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి.్భంజ్‌దేవ్‌కు మంజూరు చేసిన ఎస్టీ కులదృవీకరణ పత్రాన్ని రద్దుచేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్లు వేసినట్టు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల న్యాయ సలహాదారులు రేగు మహేష్, రిపబ్లికన్ పార్టీ నాయకులు గొంప ప్రకాష్‌లు గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కులదృవీకరణకు సంబంధించి విచారించి మూడు నెలల్లోగా నివేదిక పంపాలని రాష్ట్ర హైకోర్టు ఐటిడిఎ పిఒకు ఆదేశించిందన్నారు. అయితే కోర్టు నిర్దేశించిన గడువులోగా ఐటిడిఎ పిఒ నివేదిక పింపించకపోవడంతో కోర్టు దిక్కారం కేసు వేశామన్నారు. దీనిలో భాగంగా హైకోర్టు ఐటిడిఎ పిఒకు నోటీసులు జారీ చేసిందన్నారు. గడువులోగా ఎందుకు విచారణ జరిపి నివేదిక పంపలేదో 9వ తేదీలోగా అఫడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిందన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ సోదరుడు ఎపి.్భంజ్‌దేవ్ కుమారుడు, కుమార్తె ప్రవీణ్‌భంజ్‌దేవ్, నిరూపభంజ్‌దేవ్‌లపై కూడా గెడ్డం స్వాతి, జి.కృష్ణ అనే గిరిజనులు కేసు వేశారన్నారు. ప్రవీణ్, నిరూప ఇద్దరు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌లుగా పనిచేస్తున్నారన్నారు. వారి కులదృవీకరణ పత్రం కూడా విచారించి నివేదిక పంపాలని రాష్ట్ర హైకోర్టు ఐటిడిఎ పిఒనకు ఆదేశించిందని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల న్యాయ సలహాదారుడు రేగు మహేష్, రిపబ్లికన్ పార్టీ నాయకులు గొంప ప్రకాష్‌లు చెప్పారు.