విజయనగరం

సాదాసీదాగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సాదాసీదాగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో కౌన్సిల్ సభ్యులు గతానికి భిన్నంగా అరుపులు, కేకలు లేకుండా అజెండాలో పొందుపర్చిన అంశాలను ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. నెల్లిమర్ల వాటర్‌వర్క్స్‌లో హుదూద్ తుపాన్‌లో నేలకొరిన టేకుచెట్లు గురించి అధికారులు ఇంతవరకు పట్టించుకోక పోవడం దారుణమని 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావుఅన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు ప్రసాద్, మత్స్యరాజు, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వి.శోభన్‌బాబు, మున్సిపల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మెప్మా ప్రాజెక్టు అధికారి సరోజిని, జూనియర్ అకౌంట్స్ అధికారి ఆర్‌ఎస్‌ఆర్ కిరణ్, టౌన్ సర్వేయర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అవినీతి వ్యతిరేక పోరుకు ప్రజలు కదలాలి
* ఆమ్‌ఆద్మీ పార్టీ పిలుపు
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా కార్యదర్శి కె.దయానంద్ కోరారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌వద్ద అవినీతి భూతం దిష్టిబొమ్మను దగ్థం చేశారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ దేశంలో అవినీతి కుంభకోణాలు భయపటపడుతున్నా అవినీతిపరులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెనుకబడుగు వేస్తున్నాయని తెలిపారు. సామాన్యులకు ఒక న్యాయం, సంపన్నులకు ఒక న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత అవినీతిపరులు, నల్లకుబేరులు దర్జాగా తిరుగుతున్నారని, ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రజలు పట్టించుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో అవినీతి పెచ్చుమీరుతోందని, కొంతమంది అసమర్థ అధికారుల అండదండలతో బినామీ రాజ్యం నడుస్తుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీపార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ కన్వీనర్ లోవరాజు, సిటీ కో-కన్వీనర్ ఎంబి అప్పారావుదొర, నాయకులు షణ్ముఖరావు, టివి దుర్గారావు పాల్గొన్నారు.