విజయనగరం

డిజిటల్ లావాదేవీల అమల్లో ఆదర్శం ‘ద్వారపూడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 19: దేశంలోనే డిజిటల్ లావాదేవీల అమల్లో ద్వారపూడి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిచిందని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కితాబిచ్చారు. సోమవారం సాయంత్రం దత్తత గ్రామమైన మండలంలోని ద్వారపూడి గ్రామాన్ని సందర్శించారు. వీధుల్లో పర్యటించి నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తున్న టైలరింగ్ షాపు యజమాని సంతోష్, కిరాణ దుకాణం యజమాని శేఖర్, మురళి నుంచి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ గ్రామంగా గుర్తింపు రావడానికి కృషి చేసిన సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంపిటిసి ఈశ్వరమ్మ, బ్యాంక్ మిత్రలు, డిజిటల్ అన్న, డిజిటల్ అక్కలు, మండల స్థాయి అధికారులు, జెఎన్‌టియు విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ ద్వారపూడి గ్రామం ప్రస్తావనను ప్రధాని మోదీ మన్-కి-బాత్‌లో మాట్లాడటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర మంత్రి మృణాళిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ విప్లవం తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఒ రాజకుమారి, ఎమ్మెలీ జగదీష్, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, బొబ్బిలి మున్సిపల్ చైర్‌పర్సన్ అచ్యుతవల్లి, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, డిపిఒ సత్యనారాయణ, జెఎన్‌టియు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా అడిగితే పిడి యాక్ట్‌లు
* చంద్రబాబుపై టాడా కేసు ఎందుకు పెట్టరాదు?

విజయనగరం, డిసెంబర్ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే వారిపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారని వైకాపా అధినేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఇక్కడ పూల్‌బాగ్‌లో నిర్వహించిన యువభేరిలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై అవగాహన ఉండి తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని ఆరోపించారు. అటువంటి చంద్రబాబుపై టాడా కేసు ఎందుకు పెట్టరాదని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దేశంలో జిడిపి 7.2 శాతం ఉంటే, రాష్ట్రంలో జిడిపి 12.20 శాతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్న విషయాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో ఎంతెంత అభివృద్ధి సాధించినదీ వివరిస్తూ ముఖ్యమంత్రి చెబుతున్న దానికి, వాస్తవానికి పొంతన లేదని వ్యాఖ్యానించారు. తరువాత విద్యార్థులతో ప్రత్యేక హోదా, ఫీజు రీ-యింబర్స్‌మెంట్, ప్రభుత్వ వైఖరి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజ, విద్యార్ధి విభాగం అధ్యక్షుడు షేక్ సలాంబాబు, వైకాపా రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బి.అప్పలనర్సయ్య, బి.అప్పలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, బెల్లాన చంద్రశేఖర్, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పి.సాంబశివరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు పి.సురేష్, ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, ఎమ్మెల్యే రాజన్నదొర, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాసు, రెడ్డి శాంతి, ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్యే జోగులు, విశాఖ నుంచి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రెడ్డి వెంకటేష్ పాల్గొన్నారు.