విజయనగరం

సంక్రాంతికి 100 అదనపు బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 25: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో రెగ్యులర్‌గా తిరిగే బస్సులతోపాటు 100 బస్సులను అదనంగా నడుపుతామని ఇన్‌ఛార్జి రీజనల్ మేనేజర్ ఎన్‌విఆర్ ప్రసాద్ తెలిపారు. జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్టణం నుంచి విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు రెగ్యులర్‌గా బస్సులను నడుపుతామని చెప్పారు. ఆదివారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడుతూ జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి విజయనగరానికి నాలుగు, శ్రీకాకుళానికి నాలుగు బస్సులు చొప్పున తిప్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వచ్చే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రవాణా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రధానంగా విశాఖపట్టణం నుంచి విజయనగరం, రాజాం, పాలకొండ, గజపతినగరం, సాలూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాసిరావు, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధ్దలతో క్రిస్మస్ వేడుకలు
విజయనగరం(పూల్‌బాగ్), డిసెంబర్ 25: పట్టణంలో క్రిస్మస్ వేడుకలను ఆదివారం క్రైస్తవ, క్రైస్తవేతరులు ఘనంగా జరుపుకున్నారు. చర్చిలను సుందరంగా అలంకరించి క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే చిత్రాలను ఏర్పాటు చేశారు. క్వయిర్ బృందం పలు క్రైస్తవ భక్తిగీతాలను ఆలపించారు. పట్టణంలోని చర్చిలన్నీ సందడిగా కనిపించాయి. క్రైస్తవులు ప్రార్థనలు జరిపారు. కంటోనె్మంట్‌లోని ఆర్‌సిఎం చర్చి ప్రాంగణంలో ఉన్న మేరీ మాత విగ్రహం వద్ద కొవ్వొత్తులను వెలిగించారు. ఫాస్టర్ ప్రతాప్ దైవ సందేశాన్ని అందించారు. ఏసుక్రీస్తు మహిమాన్వితుడని, లోక రక్షణ కోసం భూమిపై వెలసిన మహనీయుడని చెప్పారు. సిమ్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి కేకు కట్ చేశారు. చర్చి కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ జాన్ పర్యవేక్షణలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. కొణిసివీధిలో ఉన్న ఏసు ప్రేమాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఫాస్టర్ రవికుమార్ దైవ సందేశాన్ని అందించి, బైబుల్ గ్రంథ పఠనం చేశారు. క్వయిర్ బృందం ఆలపించిన పలు క్రైస్తవ భక్తిగీతాలు అలరించాయి. ప్రేమాలయంలో యేసుక్రీస్తు జననాకి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. కంటోనె్మంట్‌లోని బాప్టిస్టు చర్చి, సెయింట్ పాల్ లూథరన్ చర్చి, ఎంవి చర్చిలతోపాటు పలు క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి.

పంట దిగుబడులు ఆశాజనకం

విజయనగరం, డిసెంబరు 25: ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ రబీలో రైతులు రుణాలకు అవస్థలు పడుతున్నారు. జిల్లా రైతన్నలకు ఈ ఏడాది రబీలో ఇక్కట్లు తప్పలేదు. ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ వరి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే.. ఈ ఏడాది వరి, మొక్కజొన్న విస్తీర్ణం పెరిగినప్పటికీ, ప్రత్తి, చెరకు పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఖరీఫ్ పంటల విస్తీర్ణం 1.90 హెక్టార్లు కాగా, అందులో వరి విస్తీర్ణం వరి 1.22 హెక్టార్లు. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటల్లో ముఖ్యంగా గోగు, వేరుశనగ, మొక్కజొన్న, అపరాలు, చోడి పంటలను సాగుచేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లొ వర్షాలు బాగా కురిసినప్పటికీ, తరువాత బెట్టకు వచ్చింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 15 నుంచి వర్షాలు కురవకపోవడం వల్ల వరి పంట దిగుబడులు పెరిగాయి. గత ఏడాది వరి ఎకరాకు 28 బస్తాల దిగుబడి రాగా, ఈ ఏడాది 22-36 బస్తాల వరకు మాత్రమే దిగుబడులు వచ్చాయి. మిగిలిన పైర్లు విషయానికి వస్తే వేరుశనగ తొలకరిలో విత్తిన వాటికి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఆలస్యంగా విత్తిన వాటికి దిగుబడులు సగానికి సగం మేరకు తగ్గాయి. తొలకరిలో విత్తిన వాటికి ఎకరాకు 7 నుంచి 8 బస్తాల దిగుబడి రాగా, ఆలస్యంగా విత్తిన పంటలో దిగుబడులు 3 నుంచి 4 బస్తాలు మాత్రమే వచ్చాయి. గోగు విస్తీర్ణం కూడా మొక్క పెరగాల్సిన అంత ఎత్తు పెరగకపోవడం, పురుగుల ఉధృతికి లోను కావడం జరిగింది. గోగు ఊరవేతకు రైతులు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విజయనగరం, గజపతినగరం, జామి తదితర మండలాల్లో రైతులు ఊరవేత సమస్యను ఎదుర్కొన్నారు. ప్రత్తి దిగుబడి కూడా ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షం కురిసింది.కురిసినప్పటికీ నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. చెరువులకు గండ్లు పడటం వల్ల కూడా నీరు వృధాగా పోయింది. ప్రతీ ఏటా జిల్లా నుంచి వలసలు అత్యధికంగా ఉంటున్న విషయం తెలిసిందే. జిల్లాలోని తెర్లాం, గుర్ల, దత్తిరాజేరు తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇతర జిల్లాలకు వలసలు పోతున్నారు. వీటిని అరికట్టేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్న వలసలను నివారించడంలో అధికారులు విఫలమవుతున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం సుమారు లక్ష మంది వరకు వలసలు వెళ్లి ఉంటారని అంచనా. జిల్లాలో 22.5 లక్షల మంది జనాభా ఉండగా వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు.
పంట దిగుబడులు ఆశాజనకం
రైతు కుటుంబాలు 3.5 లక్షలు, సన్నకారు రైతులు పది లక్షల మంది, మరో 3 లక్షల మంది వ్యవసాయ కూలీల కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో రబీ కాలానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేశారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 74018 హెక్టార్లు కాగా, ప్రతిపాదిత విస్తీర్ణం 70వేల హెక్టార్లుగా ఉంది. కాగా, జిల్లాలో వరికి ప్రత్యమ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం వివిధ పంటలకు 50 శాతం సబ్సీడీపై విత్తనాల అమ్మకాలు చేస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున ముందుగానే తక్కువ నీటితో ఇతర పంటలు పండించినట్టయితే రైతులకు అన్ని విధాల లాభసాటిగా ఉండగలదని అంటున్నారు. ఇప్పటి వరకు రబీలో పండిస్తున్న 9,232 హెక్టార్లలో ఇతర పంటలు పండించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది పంట మార్పిడి కింద మొక్కజోన్న, అపరాలుపై పంటలు పండించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయశాఖ జేడి లీలావతి చెప్పారు.
శిక్షణా తరగతులు
ఈ సీజన్‌లో పొలంబడి కింద మొక్కజొన్న, పెసర, మినుము, వేరుశనగ వంటి పంటలపై శిక్షణా తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు జేడి తెలిపారు. కాగా, ఈ సీజన్ నుంచి ‘ఆత్మ’ అనే పథకం అమల్లోకి వచ్చినందున రైతులు కోరిన పంటలపై శిక్షణను, ఆధునిక పరిజ్ఞానం అందించే అవకాశం లభించిందన్నారు. వరి కంటే ప్రత్యామ్నాయ పంటలు కూడా లాభసాటిగా ఉన్నందున వాటిపై రైతు సోదరులు దృష్టి సారించాలని ఆయన కోరారు.
ఉద్యమంలా రక్తదానం
* ఎమ్మెల్యే డాక్టర్ కెఎ నాయుడు
గజపతినగరం, డిసెంబర్ 25: రక్తదానం ఒక ఉద్యమంలా జరపడానికి ప్రజలు ముందుకు రావాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కెఎ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా స్థానిక వాసవీ కల్యాణ మండపంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పివివి గోపాలరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయడం ఎంతో అవసరమని, ప్రతి మనిషి జీవితంలో రక్తదానం చేయాలని సూచించారు. మొట్టమొదటిసారిగా గోపాలరాజు రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వలన ఆరోగ్యానికి ఏవిధమైన హాని ఉండదన్నారు. అపోహలు విడనాడాలని వివరించారు. బిజెపి రాష్ట్ర నేత గోపాలరాజు మాట్లాడుతూ అటల్ బిహార్ వాజ్‌పేయ్ ప్రజా ప్రతినిధులకు ఆదర్శనీయమని చెప్పారు. ప్రతి పక్షంలో ఉన్న, అధికారంలో ఉన్నా హుందాగా వ్యవహరించారన్నారు. ఈ శిబిరంలో సుమారు 60 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జడ్పీటిసి మక్కువ శ్రీధర్, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు, బిజెపి నాయకులు ఎఎన్‌ఎం శర్మ, బూడి మన్మథరావు, కందులు గుప్త, డాక్టర్ సత్య శ్రీనివాస్ పాల్గొన్నారు.
సమాజానికి, దైవానికి వారధి అర్చకుడు
* విశ్వయోగి విశ్వంజీ

విశాఖపట్నం (కల్చరల్), డిసెంబర్ 25: సమాజానికి, దైవానికి మధ్య వారధి వంటివాడే అర్చకుడని, తన మంత్ర శక్తితో భక్తులకు భగవంతుని తరపున స్వాంతన చేకూర్చే శక్తి అర్చకునికే ఉందని ఆధ్యాత్మిక గురువు విశ్వయోగి విశ్వంజీ అన్నారు. నగరంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన అర్చక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చదువుకున్న శాస్త్రాలతో మంత్రి శక్తిని సాధించి దైవార్చనలో గడిపే అర్చకులు సమాజానికి ఉపశమనం కలిగిస్తారని అన్నారు. సమాజ హితం కోరేవాడు అర్చకుడని అన్నారు. మంత్రం, తంత్రంతో కూడిన గాయత్రి ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని, గాయత్రి మంత్ర పఠనం మనిషిని ఆరోగ్య వంతునిగా చేస్తుందన్నారు. నిన్ను నువ్వు ప్రేమించినట్టే ఇతరులను ప్రేమించాలని క్రీస్తు బోధించిన తత్వం అర్చకులకు అన్వయించారు. అలాగే అవతార మూర్తులను గౌరవిస్తే అది సమాజాన్ని గౌరవించినట్టేనని అన్నారు. అర్చకులను భక్తులు దైవస్వరూపులుగా భావిస్తారని, అంతే ప్రేమను వారిపట్ల చూపాలని అన్నారు. మన దేశం ఆధ్యాత్మిక వైద్య శాలని, వైద్య కళాశాలలో వైద్యులు తయారైనట్టే భారత దేశంలో ఆధ్యాత్మిక గురువులు ప్రపంచ శాంతికోసం పనిచేస్తారని అన్నారు. విశ్వశాంతిని కాంక్షించేవారు ప్రపంచంలో ఏ శక్తికి భయపడనవసరం లేదన్నారు. శాంతి, ధర్మాన్ని కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని అన్నారు. రెండేళ్ల కిందట విశాఖను హుద్‌హుద్, ఇటీవల చెన్నైని అతలాకుతలం చేసిన తుపాన్లు పెను విధ్వంసాన్ని సృష్టించలేదంటే ఈప్రాంత ప్రజల్లో ఉండే ఆధ్యాత్మిక భక్తి భావమేనని అన్నారు. పాపం పండితే మహాత్ములు పుడతారని, పాపాలను కడిగేసే వారే అర్చకులని అన్నారు. ప్రజల్లో భక్త్భివం, ఆధ్యాత్మికత పెంపొందించేందుకు దేవాలయాలు కేంద్రాలుగా ఉన్నాయని, దీనికి వారధులుగా అర్చకులుగా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని హితవు పలికారు. ముందుగా విశ్వంజీ మహరాజ్ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక సంఘం ప్రతినిధులు వేదాంతం గోపాకృష్ణమాచార్యలు, ఆరవెల్లి సీతారామస్వామి మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అర్చక సదస్సు నిర్వహించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ టి యోగానంద్, అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు డబ్ల్యు భాస్కర్ రావు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎస్ జ్యోతి మాధవి, అర్చక సంఘం ప్రతినిధులు బృందావనం దేశికాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. టిడిపి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 26: టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం అశోక్‌బంగ్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్రిస్మస్‌ను క్రైస్తవులు ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రిస్మస్ చంద్రన్న కానుకలను పంపిణీ చేశారని తెలిపారు. టిడిపి ఎప్పుడూ పేదల కోసమే పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, పట్టణ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దాల ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సైలాడ త్రినాథరావు, జెడ్పీటీసి తుంపల్లి రమణ, టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎస్‌ఎన్‌ఎం రాజు, మున్సిపల్ కౌన్సిలర్లు ముద్దాడ చంద్రశేఖర్, మైలపల్లి పైడిరాజు, కోండ్రును శ్రీనివాసరావు, పట్టణ తెలుగుయువత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పివి రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సర్వమత సమ్మేళనం భారతదేశం సొత్తు
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 25: సర్వమత సమ్మేళనం భారతదేశం సొత్తు అని బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బవిరెడ్డి శివప్రసాదరెడ్డి అన్నారు. పట్టణంలో ఆర్‌సిఎం చర్చిలో ఆదివారం క్రిస్మస్ వేడుకలలో బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏసు కరుణామయుడన్నారు. సర్వమతాలను గౌరవించాలన్నదే ఏసు సిద్ధాంతమని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌సిఎం చర్చి ఫాస్టర్ రెవరెండ్ ప్రతాప్‌ను సన్మానించారు. స్వచ్ఛ్భారత్ జిల్లా కన్వీనర్ పాణంగపల్లి అశోక్, బిజెపి పట్టణ అధ్యక్షుడు సత్తి అచ్చిరెడ్డి, యువమెర్చా జిల్లా అధ్యక్షుడు మంత్రిప్రగడ విద్యాస్వరూప్, యువ మెర్చా పట్టణ అధ్యక్షుడు మజ్జి రమేష్ పాల్గొన్నారు.

కళల రాజధాని విజయనగరం
* జిల్లా ఎస్పీ కాళిదాసు రంగారావు

విజయనగరం(పూల్‌బాగ్), డిసెంబర్ 25: విజయనగరం కళలకు రాజధాని అని జిల్లా ఎస్పీ కాళిదాసు రంగారావు అన్నారు. ఆదివారం గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం ఫేస్ బుక్ గ్రూపు బృందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్డెన్ హెరిటేజ్ సంస్థ విజయనగరంలోని చారిత్రక సంపద ఎంత గొప్పగా ఉంటుందో తెలియచెప్పారని అన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ పట్టణానికి ఎందరో మహనీయులు పేరు తీసుకొచ్చారన్నారు. విజయనగరంలో వంద సంవత్సరాల క్రితమే విద్యా సౌరభవం వెల్లివిరిసిందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా హెరిటేజ్ గ్రూపు బృందం ప్రముఖ నటి సూర్యకుమారి, హరికథకురాలు పతివాడ జానకీదేవి, మృదంగం విద్వాంశుడు సత్యం, నటుడు పైడిరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, హెరిటేజ్ బృంద సభ్యులు పాల్గొన్నారు.