విజయనగరం

రూ. 6.35 కోట్లతో నీటి సరఫరా, పార్కుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 12: పట్టణంలో అమృత పథకం కింద 6.35 కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా, పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు చేయాలని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆదేశించారు. అమృత వార్షిక కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజుతో చర్చించారు. అమృత పథకం ద్వారా పట్టణంలో 16వేల మంచినీటి కుళాయి కనెక్షన్‌లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడం, భూగర్భజలాలు అడుగండటం, నదులు ఎండిపోవడం వల్ల మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తారకరామ తీర్థసాగర్ ద్వారా పట్టణానికి మంచినీటి సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రానున్న రోజులలో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చి మంచినీటికుళాయి కనెక్షన్‌లను మంజూరు చేస్తామని తెలిపారు. అమృత పథకం ద్వారా మంచినీటి సరఫరా కోసం 5.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కింద 2.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద కోటి రూపాయలు, పురపాలక సంఘం వాటా కింద 2.35 కోట్ల రూపాయలను సమకూర్చామని అన్నారు. అదేవిధంగా రూ.50 లక్షలతో గాంధీ పార్కును అభివృద్ధి చేస్తామని తెలిపారు.