విజయనగరం

రూ.5172.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 19: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5172.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ తయారు చేశారు. గురువారం కలెక్టరెట్‌లో నిర్వహించిన డిసిసి సమావేశ మందిరంలో దీనిని విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపి కె.హరిబాబు మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు, రెండో విడత వ్యవసాయ రుణమాఫీ, ఒబిఎంఎంఎస్ పద్దతిలో పథకాల మంజూరు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అనంతరం కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ రైతులు మొదటి విడత రుణమాఫీకి ఫారం-బి సమర్పించినందున రెండో విడత రుణమాఫీకి ‘బి’ ఫారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నార. సంక్షేమ పథకాలను ఒబిఎంఎంఎస్ పద్దతిలో ఈ నెల 27లోగా మంజూరు చేయాలన్నారు. బ్యాంకు అధికారులు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో 13 బ్లాకులలో నిర్ధేశించిన ప్రాంతాల్లో ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌బిఐ సూచనల మేరకు వ్యసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చి మ్యాపింగ్ ద్వారా రుణాలు త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. 2014-15, 2015-16లో మంజూరు చేస్తున్న యూనిట్లను వచ్చే నెలాఖరులోగా నెలకోల్పాలన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన క్రెడిట్ ప్లాన్‌ను జిల్లా కలెక్టర్, ఎంపి హరిబాబు, ఐటిడిఎ పిఒ లక్ష్మిశా, బ్యాంకు అధికారులు విడుదల చేశారు. ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలకు రూ.3387.71 కోట్లు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు రూ.922.25 కోట్లు, చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు రూ.536.15 కోట్లు, గృహనిర్మాణానికి రూ.546.75 కోట్లు, విద్యా రంగానికి రూ.70.02 కోట్లు, ఇతర రంగాలకు రూ.818.88 కోట్లు ఖర్చు కాగలదని నాబార్డు అంచనా వేసింది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు 4 శాతం వృద్ధిసాధించాలని బ్యాంకర్లకు ఆయన కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాబార్డు ఎజిఎం శ్రీనివాస్, లీడ్‌బ్యాంక్ ఎజిఎం శ్రీనివాస్, ఎస్‌బిఐ ఆర్‌ఎం జె.శ్రీనివాసరావు, ఎల్‌డిఎం, డిఆర్‌డిఎ పిడి డిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

ఆమాట మంత్రులు చెప్పాలి: భీశెట్టి

విజయనగరం (టౌన్), జనవరి 19: జిల్లా కేంద్ర ఆసుపత్రిని ప్రైవేటీకరించమని కేంద్ర , రాష్ట్ర మంత్రులు చెపితే నమ్ముతారని , రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కాదని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఈమేరకు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే పూనం మాలకొండయ్య వ్యతిరేకించ గలరా అని ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ఈలోగా ఆమె శాఖ మారిపోయినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. ఒకే నెలలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి జిల్లా పర్యటనలో జిల్లాకు ఒరిగిన లాభమేమిటని నిలదీసారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి విషయంలో మంత్రులు ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారని చెప్పారు.ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటులో ఆమె ఏ విషయం చెప్పలేదని ఆరోపించారు. ఇప్పటికయినా జిల్లా ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషిచేయాలని కోరారు.

సిఎంఆర్ మిల్లింగ్‌కు అడ్డంకులు!

విజయనగరం, జనవరి 19: జిల్లాలో సిఎంఆర్ మిల్లింగ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో రైతుల నుంచి కొనుగోలు కేంద్రాలకు తరలించాల్సిన ధాన్యం నేరుగా మిల్లర్లకు చేరుతుందని విమర్శలు విన్పించడంతో అధికారులు ధాన్యం మిల్లులపై వరుస దాడులు చేపట్టారు. అక్కడక్కడ అక్రమాలు చోటు చేసుకున్నట్టు రుజువు కావడంతో ఆయా మిల్లులపై 6(ఎ) కేసులు నమోదు చేశారు. అయితే స్థానిక అధికారులను మిల్లుల తనిఖీకి పంపిస్తే వారు మిల్లర్లతో కుమ్మక్కవుతున్నారని భావించి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పక్క డివిజన్ అధికారులను తనిఖీలకు పంపించడంతో మిల్లర్లు ఖంగుతిన్నారు. ప్రతి మూడు రోజులకు మిల్లులపై దాడులు చేస్తే తాము ఎలా మిల్లింగ్ చేసుకునేదని మిల్లర్లు వాదిస్తున్నారు. అధికారుల మూకుమ్మడి దాడులను నిరసిస్తూ గురువారం జిల్లాలో సిఎంఆర్ మిల్లింగ్‌ను నిలిపివేశారు.
ఇలా అయితే మిల్లింగ్ చేయలేం: శివ
జిల్లాలో ఏ రైతు నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా మిల్లులపై అధికారులు వరుస దాడులు చేయడం సబబుకాదని రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివ అన్నారు. ఒక పక్క గొడౌన్ల కొరత ఉన్నప్పటికీ తాము ముందుకు వచ్చి మిల్లింగ్ చేశామన్నారు. గత నెల 19 నుంచి మిల్లింగ్ చేపట్టామని ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం మూడో స్థానంలో ఉందని అన్నారు. కాగా, ఏ రైతు నుంచైనా ఫిర్యాదు ఉంటే అధికారులు ఆయా మిల్లులపై తనిఖీలు చేయవచ్చని, ఎలాంటి ఫిర్యాదు లేకుండా వరుసగా దాడులు చేపట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు. దాడులు జరపడమే లక్ష్యంగా అధికారులు వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వమే రైతులకు నేరుగా గోనె సంచులు అందజేయడం, పేమెంట్ వారి ఖాతాలో జమ చేస్తుందని మా ప్రమేయం అందులో ఏమి లేదని పేర్కొన్నారు. మా బ్యాంకు గ్యారంటీ మొత్తం మాకు ఇవ్వండి.. మీ ధాన్యం మీకు ఇచ్చేస్తాం. మీకు ఎక్కడ వీలైతే అక్కడ మిల్లింగ్ చేసుకోవచ్చని తెలిపారు.
‘ఆర్టీసీని ఆదుకోవడానికి రూ.1500 కోట్లు కేటాయించాలి’
విజయనగరం (్ఫర్టు), జనవరి 19: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో 1500 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆర్టీసీ నేషనల్ మజ్ధూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చలో రీజనల్ మేనేజర్ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ రాష్టవ్రిభజన వల్ల ఆర్టీసీ కోలుకోలేని విధంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుందని చెప్పారు. విభజన అనంతరం న్యాయపరమైన ఆస్తులు కూడా ఇంతవరకు కేటాయింపులు జరగలేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రైవేటు వాహనాల వల్ల సాలీనా రెండువేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.
ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆర్టీసీని ఆదుకోవడానికి సుమారు 1500 కోట్ల రూపాయల కేటాయించిందన్నారు. మన రాష్ట్రప్రభుత్వం రెండేళ్ల క్రితం కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసిందని, అయినప్పటికీ ఆర్టీసీకి ఒరిగిందేమి లేదని అన్నారు.
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎటువంటి సాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ కెవిఆర్ నరసింగరావు, రీజనల్ అధ్యక్షుడు బిఎస్ రాములు, రీజనల్ కార్యదర్శి ఎంఎ రాజు, డివిజన్ అధ్యక్షుడు కెసిహెచ్ వౌళి, డివిజనల్ కార్యదర్శి డిఎస్ రావు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెవిఆర్ కుమార్, జోనల్ సహాయ కార్యదర్శి కెఎస్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

‘రహదారి భద్రతా నియమాలను పాటించాలి’
విజయనగరం (్ఫర్టు), జనవరి 19: రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని జిల్లా సంయుక్త కలెక్టర్-2 యుసిజి నాగేశ్వరరావుఅన్నారు. స్థానిక ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో గురువారం 28వ రహదారి భద్రతా వారోత్సవాల వాహనా ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాగేశ్వరరావుమాట్లాడుతూ ‘మీ క్షేమమే-మీ కుటుంబానికి రక్షణ’ అనే విషయాన్ని వాహనచోదకులు గుర్తించుకోవాలని చెప్పారు. జిల్లాలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలలో 316 మంది మృతి చెందారని, మరో 1600 మంది క్షతగాత్రులయ్యారని తెలిపారు. వాహనచోదకులు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సందర్భంలో రవాణాశాఖ అధికారులు అందించిన నియమాళిని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకుని వాహనాలు నడిపితే ప్రమాదాలు సంఖ్య గణనీయంగా తగ్గుతాయని అన్నారు.
రహదారుల వెంట అధికారులు ఏర్పాటుచేసిన సైన్‌బోర్డులపై చేసే హెచ్చరికలను తప్పకుండా పాటించడం వల్ల కూడా ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. విజ్ఞతను కోల్పోయి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే తమ కుటుంబాలనే కాకుండా ఆవతలివారి కుటుంబాలు కూడా అనాధలుగా మిగులుతారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. జిల్లా ఉప రవాణాశాఖ కమీషనర్ భువనగిరి శ్రీకృష్ణవేణి మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాళిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కోరారు. అప్పుడే అందరికీ సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో 13రకాల నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి 8800 కేసులు నమోదు చేశామన్నారు. ప్రాంతీయ రవాణాశాఖ అధికారి కనకరాజు మాట్లాడుతూ సెప్టీ ఆల్వేస్ ఆఫ్ ఆల్ రోడ్స్ (సఫర్)పై అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లు మురళీకృష్ణ, దుర్గాప్రసాద్, ప్రవీణ్‌కుమార్, శ్రావ్య, అప్పన్న, రవికుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రవాణా పన్నుల భారం ఆటో కార్మికులపై మోపవద్దు
విజయనగరం(టౌన్), జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులపై ఆకస్మికంగా మోపిన రవాణా పన్నుల భారం తక్షణం ఉపసంహరించాలని ఎపి ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి నారాయణరావు డిమాండ్ చేసారు. గురువారం ఈ మేరకు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఇప్పటికే డీజిల్, పెట్రో ధరల భారంతో సతమతమవుతున్న ఆటో కార్మికులపై ప్రభుత్వం హఠాత్తుగా చలానా రూపంలో పన్నుల భారం మోపడం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. పెద్ద నోట్ల రద్దుతో వర్తక , వాణిజ్య కార్యకలాపాలు మందగించి ఆటో కార్మికుల కష్టానికి తగిన బాడుగ దొరకని పరిస్ధితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేసారు. రోడ్డు ట్యాక్స్, ఫిట్‌నెస్, ఇతర పన్నుల అమాంతం పెంచేసారని ఆరోపించారు. రోడ్డు ట్యాక్స్ కట్టడంలో ఆలశ్యం అయితే రోజుకు 50 రూపాయలు అపరాధ రుసుం విధించే విధంగా నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఈ పన్నుల భారం మోయడం ఎలాగని ప్రశ్నించారు. ఆటో కార్మికుల వృత్తిని దెబ్బతీయడంలో భాగంగా ఈ కుట్రలు పన్ను తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్‌యూనియన్ ఉపాధ్యక్షులు నీలాపు అప్పలరాజురెడ్డి, ఎ ఐ ఎఫ్‌టియు నాయకులు గణేష్ పండా, బెహరా శంకరరావు, ఆటోకార్మికులు పాల్గొన్నారు.

ప్రకృతి వైపరీత్యాలపై సమీక్ష

విజయనగరం, జనవరి 19: ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటపుడు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో అఖిల భారత ప్రకృతి వైపరీత్యాల నిర్వాహణ సంస్థ ప్రతినిధులు సమీక్ష జరిపారు. దీనికి సంస్థ ప్రతినిధి ఆనంద్ ప్రకాష్ కనూ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటపుడు అనుసరిస్తున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాలకు వెంటనే స్పందించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, స్థానిక సంస్థలు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, అనుబంధ రంగాలు, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, నీటి సరఫరా, విద్యుత్, టెలీ కమ్యూనికేషన్స్, రవాణా తదితర శాఖలు ఏ తీరున స్పందిస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సంభవించే ప్రకృతి విపత్తులు, వడగాలులు, తుపాన్లు, భూకంపాలు తదితర వాటిపై మండలాల వారీగా సేకరించిన సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 27న నిర్వహించే తదుపరి సమావేశంలో జిల్లాకు ఏయే సౌకర్యాలు కావాలి, ప్రతిబంధకాల వివరాలు తదితర వాటిని తమకు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు ధార్మిక్ పురోహిత్, దయానంద్ బాబ్జి, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
జన్మభూమి కమిటీలతో అర్హులకు అన్యాయం
* పలువురు సర్పంచ్‌లు ఆవేదన
వేపాడ, జనవరి 19: జన్మభూమి కమిటీల పేరుతో పింఛన్లు, పక్కా గృహాల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతుందని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నీలకంఠరాజపురం, ఆర్.కె.పేట పి.కె. ఆర్.పురం వావిలపాడు, చినగుడిబాల తదితర గ్రామాల సరపంచులు కండిపల్లి చిట్టితల్లి, బోజంకి దుముడమ్మ, ముమ్ములారి రామచంద్రుడు, బీల రాజేశ్వరి, శీరంరెడ్డి సింహాద్రప్పడు, తదితరులు గురువారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
జన్మభూమి కమిటీల చైర్మన్లుగా సర్పంచులను నామకాగా నియమించి వారి సంతకాలు లేకుండా పింఛన్లు ఎంపిక చేసి పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లను అపహాస్యం చేయడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు.
అలాగే ప్రభుత్వ అధికారిగా ఉన్న ఎంపిడో ఆదేశాలపై ఎంపిక చేయవలసిందిపోయి కార్యకర్తలు, నాయకులు ఎంపికచేస్తున్న అనర్హులకు పథకాలు కట్టబెట్టడం మరీ అన్యామని వారు ఆందోళన వ్యక్త చేశారు. రాజ్యంగానికి విరుద్దంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి అధికారులను సైతం డమీ చేయడం తగదని జరుగున్న అన్యాయాలపై కోర్టుకు వెళ్లకపత్పదని ఆయా గ్రామాల సర్పంచలు హెచ్చరించారు.
త్వరితగతిన
ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి
* గృహ నిర్మాణ శాఖ డిఇఇ శంకరరావు
వేపాడ, జనవరి 19: ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలను లబ్దిదారులు త్వరితగతిన చేపట్టాలని గృహ నిర్మాణశాఖ డిఇఇ జి.జి.శంకరరావు కోరారు. మండలంలోని చామలాపల్లి, వల్లంపూడి, నల్లబిల్లి, వావిలపాడు గ్రామాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను నాయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డి ఇ ఇ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొత్తవలస డివిజన్‌లో కొత్తవలస, ఎల్.కోట, వేపాడ మండలాల్లో 1235 పక్కా గృహాలను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటిలో 850 ఇళ్లు నిర్మాణాలు ప్రారంభం కాగా 400 ఇళ్లు పునాదుల స్థాయిలో ఉన్నాయని చెప్పారు. వేపాడ గ్రామంలో అత్తాకోడళ్లయిన లెక్కల ముత్యాలమ్మ, లెక్కల లక్ష్మిలకు రెండు ఇళ్లు మంజూరుకాగా ఒకే స్థలంలో ఇల్లు కట్టి రెండుగా చూపించగా జియోట్యాగింగ్‌లో సిస్టమ్ ఆమోదించనందున బిల్లు పెట్టలేకపోతున్నామని అన్నారు. కాగా ఈ మూడు మండలాల్లో నిర్మాణానికి నోచుకుంటున్న ఇళ్లు స్టేజీలను గుర్తించి ఆయా స్థాయిల్లో బిల్లులు పెడుతున్నామని డిఇఇ శంకరరావు చెప్పారు. ఈ పరిశీలనలో ఆయన వెంట వేపాడ, ఎల్.కోట ఏ ఇలు ఎ.రమేష్, ఎస్.వి.సత్యనారాయణలు ఉన్నారు.
వృద్దులను ఆదుకోవాలి
విజయనగరం(పూల్‌బాగ్),జనవరి 19: దైవసమానులైన వృద్ధులను ఆదుకోవాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు డి.వెంకట సత్యనారాయణ అన్నారు.పట్టణంలోని పూల్‌బాగ్‌లో ఉన్న ప్రేమసమాజంలో గురువారం వృద్ధులకు చీరలు,్ధవతులు,తువ్వాళ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాద్యమాలను,సమాజ సేవకులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు తమకు తోచిన సహాయం అందచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రేమసమాజం మేనేజర్ ఆదినారాయణ, వృద్ధులు పాల్గొన్నారు

11న లోక్‌అదాలత్
* సత్వర న్యాయమే లక్ష్యం

విజయనగరం, జనవరి 19: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి బి.శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లాకోర్టు ఆవరణలో తన చాంబరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2007లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారిగా లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. అప్పటి నుంచి ప్రతి నెల రెండో శనివారం జిల్లా ప్రధాన కేంద్రంతోపాటు ఎనిమిది మండలాల పరిధిలో జాతీయ లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల కక్షిదారులకు వృధా ఖర్చు మిగలడంతోపాటు కాలయాపన లేకుండా ఉంటుందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 17391 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కక్షిదారులు ముందుకు వచ్చి లోక్‌అదాలత్‌కు దరఖాస్తు చేసుకుంటే సత్వర న్యాయ పరిష్కారం పొందడానికి వీలుంటుందన్నారు. ఈ నెల 21, 22, తేదీల్లో జిల్లా న్యాయ సేవా సదన్ భవన్‌లో డిస్ప్యూట్ రిజల్యూషన్ అనే అంశంపై రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నట్టు జిల్లా జడ్జి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవ ప్రాధికార సంస్థ సూచనల మేరకు ఈ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు.