విజయనగరం

జిల్లాకు 38వేల కొత్త రేషన్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 20: జిల్లాలో కొత్తగా 38వేల మందికి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి మృణాళిని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆహార సలహా కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదేనని అన్నారు. ఇ-పాస్ ద్వారా రేషన్ సరకుల పంపిణీలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందన్నారు. ఇపాస్ విధానంలో అక్కడక్కడ వేలిముద్రలు, ఇంటర్నెట్‌తో అనుసంధానం కాకపోవడం వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో 7 లక్షల మందికి చంద్రన్న కానుకలు అందజేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 వేల మందికి విఆరోవ్వల ధ్రువకరణతోవ రేషన్ తీసుకుంటున్నారని వారందరిక బయోమెట్రిక్ విధానంలోకి తీసుకురావాల8న్నారు. అందుకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఇదిలా ఉండగా ధాన్యం ఏకరణర కేంద్రాల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. రైతు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. దళారుల బారిన పడకుండాఅ చొడాలిజ్సన బాధ్యత అ1్ధకారులపై ఉందన్నారు. గుమ్మలక్ష్మిపురంలో 1200 బస్తాల8 బియ్యం పట్టుబడిన విషయాన్ని నాగమణి అడగగ్గా దానిపై చర్యలు తసుకున్నామని సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ రామచంద్రరావు బదులిచ్చారు. జిల్లాలవో ఇమప్పటి వరకు 2.95 లక్షల టన్మునల సేకరణ పూర్తయ్యిందని, రైతులకు చెల్లించాల్సిన రూ.435 కోట్ల రూపాయల చెల్లింపులో ఇప్పటి వరకు రూ.376 కోట్లు చెల్లింపులు జరిపామని, మిగిలిన రూ.59 కోట్లు మొడు రోజుల్లో పూర్తి చేస్తామని రామచంద్రరావు మంత్రికి వివరించారు. ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడిన 14 కేంద్రాలను, మిల్లింగ్‌లో అక్రమాలకు పాల్పడిన ఆరు రైస్ మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెట్టామని వివరించారు. కాగా ఎమ్మెల్యే కెఎ నాయుడు, మీసాల గీత, ఎమ్మెల్సీలు జగదీష్, సంధ్యారాణిలు మాట్లాడుతూ ఇపాస్ యంత్రాలలో కొంతమంది వినియోగదారుల ఐరిష్, వేలిముద్రలు పడకపోవడం వల్ల సరకులు అందడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు. ఇపాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలను సవరించాలని తెలిపారు. సాలూరు వినియోగదారుల మండలి సభ్యుడు సీతారాం మాట్లాడుతూ సాలూరులో రైతు బజారుకు స్థలం మంజూరైందని వెంటనే దానిని ప్రారంభించాలని కోరారు. అలాగే పెట్రోల్ బంకులలో కనీస సదుపాయాలు ఉండటం లేదని, బంకులలో కల్తీని అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారి, చిరంజీవులు, జెసి లఠ్కర్, డిఎస్‌ఒ శాంతికుమారి, ఆర్డీఒ శ్రీనివాసమూర్తి, మార్కెటింగ్ ఎడి శ్రీనివాసరావు, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, రామారావు, బిజెపి నేత ముద్దాడ మధు, ఇతర పార్టీల ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
డామిట్..! కధ అడ్డం తిరిగింది!!
* రాజుకున్న ‘చిచ్చు
* మిల్లర్స్ వర్సెస్ యంత్రాంగం
* మిల్లర్ల బాగోతం బట్టబయలు?

విజయనగరం, జనవరి 20: జిల్లాలో ధాన్యం మిల్లర్లు అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు యంత్రాంగం దాడులకు పాల్పడగా, మిలర్లు మిల్లింగ్ నిలిపివేయడంతో అధికార యంత్రాంగం దిగి వస్తుందనుకుంటే కథ అడ్డం తిరిగింది. ధాన్యం మిల్లింగ్ నిలిపివేయడంతో చిచ్చు రాజుకుంది. జిల్లా యంత్రాంగానికి, మిల్లర్లకు మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఎలాంటి సమాచారం లేకుండా మిల్లర్లు తమ ఇష్టం వచ్చినట్టు మిల్లింగ్ నిలిపివేయడం ఏమిటని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస దాడులకు భయపడి ఏకపక్షంగా మిల్లర్లు మిల్లింగ్ నిలిపివేసిన విషయం విదితమే. ఎక్కడాలేని విధంగా ఇక్కడ వరుస దాడులు జరపడం వల్ల తాము ఆందోళన చెందుతున్నామని, తాము కట్టిన బ్యాంక్ గ్యారంటీని వెనక్కి ఇచ్చేయమని, మిగిలిన ధాన్యం పట్టుకెళ్లి ఇంకెక్కడైనా మిల్లింగ్ చేసుకోవాలని మిల్లర్లు ప్రకటించడంతో కలెక్టర్ దీనిపై సీరియస్‌గా వ్యవహరించారు. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన తరువాత మిల్లర్లు వాటిని మిల్లింగ్ చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఆ మేరకు ముందుగా సివిల్ సప్లయిస్ వాళ్లతో ఎంఒయు కుదుర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎంఒయు కుదుర్చుకున్న తరువాత ఎవరిని సంప్రదించకుండా మిల్లర్లు నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా మరోపక్క మిల్లర్లు ఏ మేరకు నిబంధనలు పాటిస్తున్నారనే అంశంపై ఆరా తీయనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు నిబంధనలు పాటించని మిల్లర్లపై చర్యలకు యంత్రాంగం ఉపక్రమించనున్నట్టు సమాచారం. జిల్లాలో మొత్తం 145 ధాన్యం మిల్లులు ఉండగా వీటిలో ఎన్ని నిబంధనలు మేరకు ఉన్నాయి? అగ్ని ప్రమాదం జరగకుండా ఏమైన చర్యలు తీసుకుంటున్నారా? విద్యుత్ కనెక్షన్లు సక్రమంగా ఉన్నాయా? కాలుష్య నివారణకు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? తదితర అంశాలపై ఆరా తీయనున్నట్టు తెలిసింది. మరోపక్క ధాన్యం సేకరణలో అక్రమాలకు పాల్పడిన 14 కేంద్రాలను, ధాన్యం మిల్లింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ఆరు రైస్ మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించిన విషయం విధితమే. ఏది ఏమైనప్పటికీ ధాన్యం మిల్లర్లకు, యంత్రాంగానికి మధ్య చిచ్చు రగలడంతో ఏ మేరకు మిల్లింగ్ జరగనున్నదీ సందేహాస్పదమే.