విజయనగరం

భయమే నిజమైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, జనవరి 21: తాటిపూడి జలాశయం మెయిన్ గేట్లకు మరమ్మతు పనులు చేపట్టకుంటే పెనుప్రమాదం తప్పదని ఆయకట్టు రైతులు వ్యక్తం చేస్తూ వస్తున్న భయమే నిజమైంది. శనివారం జలాశయం 4వ నెంబరు గేటు హటాత్తుగా పైకిలేచి బయటకు వృధాగా పోయిన నీరు, సంభవించిన ప్రమాదం అందుకు నిదర్శనం. 1964లో నిర్మించిన తాటిపూడి జలాశయం నుంచి విశాఖపట్నం ప్రజలకు తాగునీటి అవసరాలకు, గంట్యాడ, జామి, శృంగవరపుకోట మండలాల పరిధిలోని సుమారు 15వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీటిని సరఫరా చేస్తున్నారు. జలాశయం గేట్లు మరమ్మతులకు గురైనప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి మరమ్మతు పనులు మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. ఈ విషయమై ఆయకట్టు రైతులు మెయిన్ గేట్లకు మరమ్మతు పనులు చేపట్టాలని లేని పక్షంలో ముంపుతప్పదని పలుమార్లు నీటిపారుదల శాఖ అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు సైతం వినతి పత్రాలను సమర్పిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడం వలన శనివారం నాటి ప్రమాదం సంభవించిందని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ సంఘటనకు కారణమని విమర్శిస్తున్నారు. హుదూద్ తుపాను తరువాత నుంచి జలాశయం గేట్లకు మరమ్మతు పనులు చేపట్టనందున ఖరీఫ్‌కు నీటి విడుదల సమయంలో గేట్లు పలుమార్లు మొరాయించాయి. అప్పటిలోనే అధికారులకు రైతులు మరమ్మతుల విషయమై గట్టిగా తమ నిరసన గళాన్ని వినిపించారు. తాటిపూడి నీటిపారుదల శాఖ విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
ఇదిలా ఉండగా నిధుల కొరత కారణంగానే జలాశయం గేట్లు మరమ్మతు పనులు చేపట్టలేకపోయామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. జలాశయం నిర్వహణ నిమిత్తం విశాఖ నగర పాలక సంస్థ నుంచి నిధులు రావాల్సి ఉందని, దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆ నిధులు రాలేదని దీనివలన పనులు చేప్టలేకపోయామని అంటున్నారు. గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ. నాయుడు సైతం ఇదే విషయాన్ని కలెక్టర్ వివేక్ యాదవ్‌కు తెలియజేశారు.

ప్రమాదంపై భిన్న కథనాలు

తాటిపూడి జలాశయం నాల్గవ నెంబరు గేటు హటాత్తుగా పైకి లేవడానికి దారితీసిన కారణాలపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆయకట్టు రైతులు చెబుతున్నా దానికి, నీటి పారుదల శాఖ అధికారులు తెలియజేస్తున్న కారణాలకు ఎక్కడ పొంతన కుదరడంలేదు. సంవత్సరాల తరబడి గేట్లకు మరమ్మతులు చేపట్టనందున నాల్గవ నెంబర్ గేటు బ్యాలెన్స్ రోప్ తెగిపడిందని దీనివలనే గేటు హటాత్తుగా పైకి లేచి పెనుముప్పు వాటిల్లిందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన భారీ స్థాయిలో నీరు వృథాగా బయటకు పోయిందని అంటున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా సమయంలో ఇరిగేషన్ సిబ్బంది ఎవరు జలాశయం వద్ద లేరు. గేట్లకు వేసిన తాళాలు అలాగే ఉన్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు డ్యామ్‌పై ఉన్న ఇరిగేష్‌న్‌ఎలక్ట్రిషియన్ టిఫెన్ చేయడానికని కిందకి దిగి ఇంటివెళ్లారని చెబుతున్నారు. కొంతసేపటి తరువాత స్థానికులు కొందరు వచ్చి నీరు వదలడానికి గేటు ఎత్తారని ప్రశ్నించడంతో ఆశ్చర్యపోయిన తాను పరుగున డ్యాం వద్దకు చేరుకున్నానని పేర్కొన్నారు. గేటు హటాత్తుగా పైకి లేవడానికి ఎవరో చేసిన చర్య అని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.