విజయనగరం

ఐఎస్‌ఎల్ వినియోగం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 24: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐఎస్‌ఎల్) నిర్మాణం ఎంత ముఖ్యమో అంతకంటే దాని వినియోగం మరింత ముఖ్యమని గుర్తించాలని జెడ్పి సిఇఒ, ఒడిఎఫ్ నోడల్ అధికారి రాజకుమారి అన్నారు. మంగళవారం ఆమె జెడ్పీలో ఏర్పాటు చేసిన ప్రజా ఆధారిత సంపూర్ణ పారిశుద్ధ్యం శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌డిఎ ప్రాజెక్టు అధికారి ఢిల్లీరావు మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లోకి వెళ్లేటపుడు ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉందన్నారు. అందువల్లనే ప్రభుత్వం దీనిపై ఎక్కువ ప్రాథాన్యతనిస్తుందని వివరించారు. రిసోర్స్ పర్సన్ మాధురి మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణానికి ఎంత విస్తీర్ణం ఉండాలి? ఎంత లోతుగా తవ్వాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రజల్లో ఎలాంటి సందేహాలు ఉన్నాయి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారులు, ఎంపిడిఒలు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇలు, కన్సల్టెంట్ సుధాకర్, ఎపిఎంలు, ఎపిఒలు తదితరులు పాల్గొన్నారు.

29న పల్స్‌పోలియో
విజయనగరం, జనవరి 24: జాతీయ ఇమ్యూనైజేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్స్ పోలియో చేపట్టాలని జెసి యుసిజి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0-5 వయస్సు గలల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. జిల్లాలో ఐదేళ్లలోపు గుర్తించిన 2,42,439 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసి లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 1600 పల్స్ పోలియో బూత్‌లు, 3200 బృందాలు, 160 సూపర్‌వైజర్లు, 73 మొబైల్ టీమ్‌లు, 44 ట్రాన్సిట్ టీములు ఏర్పాటు చేసామన్నారు. బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లులో పల్స్‌పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసామని, ఆర్టీసీ, రైల్వే అధికారులు సహకారం అందించాలని కోరారు.
ఈనెల 29 నుంచి 31 వరకు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా స్వయం సహాయక గ్రూపులు, ఆశా వర్కర్లను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఫిబ్రవరి 10 డి-వార్మింగ్ సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు డీ వార్మింగ్ మాత్రలు మోతాదు ప్రకారం వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఈసమావేశంలో డిఎం హెచ్‌ఒ డాక్టర్ పి. పద్మజ, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఉషశ్రీ, వైద్య ఆరోగ్య శాఖ వివిధ విభాగాల అధికారులు, మెప్మా పిడి ప్రకాశరావు, ఎపిఆర్వో చిప్పాడ ప్రభుదాస్, రవాణా, పంచాయితీ, మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ, విద్యాశాఖ, ఆర్టీసీ మత్స్యశాఖల సిబ్బంది పాల్గొన్నారు.