విజయనగరం

లయన్స్ ద్వారా సేవలను విస్తృతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జనవరి 30: లయన్స్ క్లబ్‌ల ద్వారా సేవలను విస్తృత పరచనున్నామని లయన్స్ జిల్లా గవర్నర్ నూకరాజు అన్నారు. సోమవారం స్థానిక శ్రీనివాస నర్సింగ్ హోం ఆవరణలో 4,500 లీటర్ల సామర్థ్యంగల బెల్లాన మంచినీటి ట్యాంకును గవర్నర్ నూకరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా నాలుగు అంశాలపై సేవలను విస్తృతపరుస్తామని తెలిపారు. దృష్టిలోప నివారణ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టడానికి శ్రీకారం చుడడతామని చెప్పారు. ఆకలితో అలమటించే పేదలకు కొంతవరకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆహార ధాన్యాలు అందించాలని, దృష్టిలోప నివారణ, ప్రకృతిని కాపాడడం, యువతను సరైన మార్గంలో నడిచే విధంగా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా ఫాస్ట్ గవర్నర్ డాక్టర్ బి. ఎస్. ఆర్. మూర్తి, డాక్టర్ బి. నాగనరేంద్ర, లయన్స్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గేదెల జగదీష్, ఆదుర్తి విజయలక్ష్మి, లయన్ బి. లక్ష్మి, లయన్ ఆదుర్తి రామకృష్ణ, వెంకటేశ్వరరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
గాంధీజీ ఆశయాలకు కృషిచేద్దాం
దత్తిరాజేరు, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని తహశీల్దార్ కల్పవల్లి అన్నారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులతోపాటు తహశీల్దార్ కల్పవల్లి గాంధీ చిత్రపటం వద్ద రెండు నిమిషాలపాటు వౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కల్పవల్లి మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరు పాటించి ఆయన అడుగు జాడల్లో నడవడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఓడి ఎఫ్ ప్రకటించిన గ్రామాలలో రాత్రి సమయాలలో నిద్రించి వేకువజామునే మరుగుదొడ్లు నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిడి ఓ ఆర్.వి.కె. పట్నాయిక్, ఎంఇఓ ఎస్.వెంకటరావు, ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ చంద్రకళ, ఏపిఎం అచ్యుతరావు, ఏపిఓ వెంకటప్పలనాయుడు, ఏ ఎంసి అధికారి శ్రీనులతోపాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మహాత్ముని సిద్ధాంతాలను ఆచరించాలి

విజయనగరం(పూల్‌బాగ్), జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని నారాయణ పాఠశాల కరస్పాండెంట్ నారాయణరావు అన్నారు. తెలుగుభాషా సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం పాఠశాలలో గాంధీజీ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్‌వారిని మనదేశం నుండి వెడలగొట్టి స్వాతంత్య్రాన్ని సంపాదించడంలో మహాత్ముడు అనుసరించిన సత్యం, శాంతి, అహింసా మార్గాలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని చెప్పారు. ప్రకృతిని ప్రేమించి పర్యావరణాన్ని పరిరక్షించామని చెప్పి గాంధీజీ సిద్ధాలను ఆచరించి దేశాభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులందరు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా సేవా సంఘం అధ్యక్షుడు రామానాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.