విజయనగరం

‘సంది’గ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 11: సాధారణంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులంటే ఆసక్తి చూపే ఆశావహులు ఉన్నప్పటికీ ఈ దఫా ప్రధాన పార్టీల్లో స్తబ్ధత నెలకొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తొంది. ఈ దఫా ఉత్తరాంధ్ర పట్ట్భద్ర ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి టిడిపి తన అభ్యర్థిని రంగంలో దించుతుందా? లేదా బిజెపికి వదిలి పెడతారా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ ఖరారైనప్పటికీ ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో ఆయా పార్టీల తరఫున టిక్కెట్ ఆశిస్తున్న వారు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల జాబితా ఖారారు కాకపోవడంతో టిడిపి ప్రచారం ఇంకా మొదలు పెట్టలేదు. ఇదిలా ఉండగా వైకాపా మాత్రం తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఎవరిని బరిలోకి దింపేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం టిడిపి తరఫున ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశిస్తున్న వారిలో మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్, ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరువు రామకోటయ్య ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా బిజెపి నుంచి పివి చలపతిరావు తనయుడు పివి మాధవ్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక లోక్‌సత్తా విషయానికి వస్తే ఈ దఫా లీడర్ సంపాదకుడు రమణమూర్తికి తమ మద్దతును ప్రకటించింది. సిపిఎం, కార్మిక సంఘాల నుంచి ఉత్తరాంధ్ర ఐక్య వేదిక ప్రతినిధి అజశర్మ బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దభేల్ దుబేల్ నుంచి ఆదాడ మోహనరావు పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా పతివాడ రమణ, ఎం.బి.అప్పారావు తదితరులు గత రెండు నెలలుగా ఉత్తరాంధ్రలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేపట్టి రెండు నెలలు గడుస్తున్నా, ప్రధాన పార్టీలు మాత్రం ఈ ఎన్నికపై ఆసక్తి చూపకపోడం గమనార్హం. దీంతో ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నారా? లేదా అన్న అనుమానం ఆయా శ్రేణుల్లో కలుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇంకను దాదాపు మరో నెల రోజుల గడువు మాత్రమే ఉంది. ఏ అభ్యర్థియైనా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ప్రచారం నిర్వహించాలంటే ఇపుడు ఉన్న సమయం చాలదని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రధాన పార్టీలు దూరంగా ఉంటున్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
ఎమ్మెల్సీఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోండి
* డాక్టర్ చుక్కా రామయ్య
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, ఫిబ్రవరి 11: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటర్లు సమర్థులకు పట్టం కట్టాలని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ హోటల్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పట్ట్భద్రుల ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యారంగంలో పరిణామాలు’ అనే సదస్సుకు ఆయన ముఖ్య వక్తగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్ని వత్తిడులు వచ్చిన సమర్థులకు ఓటు వేయాలన్నారు. పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎ.అజశర్మకు మద్దతునివ్వాలని కోరారు. శాసనమండలిలో సమర్థులైన నాయకులు ఉంటే ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా ‘విద్యారంగంలో పరిణామాల’పై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలపై నిర్లక్ష్యం చూపుతున్నాయన్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే విద్య, వైద్యం రెండు రంగాలు కీలకమన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా విద్యా హక్కును సాధించామని, కాగా, విద్యార్థులు తక్కువ మంది ఉన్నారని పాఠశాలలు మూసివేస్తే అక్కడ అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని ఆయన ప్రశ్నించారు. నిర్లక్ష్యానికి గురైన 400 మంది విద్యార్థులకు కూడా చదువు చెప్పిస్తే అందులో 10 మంది ఐఐటికి ఎంపికయ్యారని ఆయన గుర్తు చేశారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు కావాల్సిన అవసరాలను తీర్చడం ద్వారా బడుల్లో డ్రాపవుట్స్‌ను అరికట్టగలమన్నారు. ఇదిలా ఉండగా సబ్‌ప్లాన్ నిధుల్లో కూడా కేటాయింపులు ఘనంగా ఉన్నప్పటికీ, ఆచరణలో మాత్రం నిధులు వెచ్చించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకం అమలు చేస్తున్నప్పటికీ అది వడ్డించే విధానం కూడా ముఖ్యమన్నారు. పిల్లలకు మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు నైతిక విలువలపై అవగాహన కల్పించాలన్నారు. ఇక ఉన్నత విద్యలో సరిపడా సిబ్బంది లేకుండా విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని రోహిత్ సంఘటన ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ఇక వైద్య రంగానికి సంబంధించి మందుల ధరలు తగ్గిస్తే సామాన్యులకు ఎక్కువ మేలు కలుగుతుందన్నారు.
పిడిఎఫ్ అభ్యర్థి అజశర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అక్షరాస్యతలో అత్యంత వెనుకబడి ఉన్న జిల్లాగా విజయనగరం ఉండటం విచారకరమన్నారు. త్రిపురలో ముగ్గురు విద్యార్థులు ఉన్నా అక్కడ పాఠశాలను ఏర్పాటు చేస్తారని అందువల్లనే అక్కడ శతశాతం అక్షరాస్యత ఉందన్నారు. ఇటీవల నూతన విద్యా విధానం ప్రకారం అందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. దీనివల్ల కూడా పెడధోరణులు కలిగే ప్రమాదం ఉందన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర జెఎసి సెక్రటరీ జనరల్ ఐ.వేంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన విద్యా విధానం తదితర అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.రాము అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషగిరి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మున్సిపల్ ఆర్వోకు మెమో
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 11: మున్సిపల్ రెవెన్యూ అధికారి పి.శ్రీనివాసరావుకు మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు మెమో జారీ చేశారు. ఈమేరకు ఆర్‌ఓసి నెంబర్ 2365/2015-సి1 సర్కులర్‌ను జారీ చేశారు. పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లు, పాత బకాయిల వసూళ్లకు సంబంధించి రోజూ వారీ సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం వల్ల రెవెన్యూ సిబ్బంది, బిల్లుకలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పన్నులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మెమోలో పేర్కొన్నారు. కార్యాలయ సెల్‌ఫోన్‌కు స్పందించకపోవడంతోపాటు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు శెలవుపై వెళుతున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. క్రమశిక్షణా రాహిత్యంతో పనిచేస్తున్నట్లు, విధులు బాధ్యతారాహిత్యంతో నిర్వహిస్తున్నట్లు, పనితీరు సంతృప్తికరంగా లేనినట్లు అధికారులు గుర్తించారని శ్రీనివాసరావుకు జారీ చేసిన మెమోలో మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ విషయాలపై నిర్లక్ష్యం వహిస్తున్నందున మీపై ఎందుకు తగిన చర్యలు తీసుకోకూడతో సంజాయిషీ ఇవ్వాలని మెమోలో తెలియజేశారు.

ఎట్టకేలకు షాపింగ్ కాంప్లెక్స్ పనులు ప్రారంభం
పనులు విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 11: పట్టణంలో జనతాబజారులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణపనులు ఎట్టకేలకు శనివారం ప్రారంభమయ్యాయి. ‘ప్రతిపాదనలకే పరిమితమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం’ అనే శీర్షికతో ఈనెల 9వతేదీన ఆంధ్రభూమిలో వచ్చిన వార్తపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌తో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణపనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావుమాట్లాడుతూ జనతాబజారులో శిథిలావస్థలో ఉన్న పాత షాపింగ్ కాంప్లెక్స్‌ను తొలగించి కొత్తగా షాపులను నిర్మించేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొంది టెండర్లు పిలిచి గుత్తేదారుడికి పనులు అప్పగించామని తెలిపారు. షాపులలో ఉన్న కొంతమంది కోర్టులో వాజ్యం వేయడం వల్ల కొత్త షాపుల నిర్మాణంలో జాప్యం జరిగిందని చెప్పారు. అయితే గతనెల 30వతేదీ నుంచి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి షాపులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. షాపుల నిర్మాణపనులను మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావుతోపాటు డిప్యూటీ ఇంజనీర్ ఎస్.మత్స్యరాజు, అసిస్టెంట్ ఇంజనీర్లు వంశీకృష్ణ, సన్యాసిరావుపరిశీలించారు.

లెర్నర్ లైసెన్స్ ప్రత్యేక మేళాకు స్పందన

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 11: జిల్లా ప్రధాన రవాణాశాఖ కార్యాలయంలో ఆటోరిక్షా బాడ్జీలేని డ్రైవర్లకు లెర్నర్ లైసెన్స్ మంజూరు కోసం శనివారం నిర్వహించిన ప్రత్యేక మేళాకు అనూహ్య స్పందన లభించింది. బాడ్జీ లేని ఆటోడ్రైవర్లకు లెసెన్స్‌ల జారీలో ప్రభుత్వం విద్యార్హతలను సడలించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు లెర్నర్‌లైసెన్స్‌లు జారీ చేసేందుకు శని,ఆదివారాలు రెండురోజుల పాటు మేళా నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలోభాగంగా ఆదివారం నిర్వహించిన మేళాకు జిల్లా నలుమూలల నుంచి వందలాదిమంది ఆటోడ్రైవర్లు వచ్చారు. ఈ సందర్భంగా ఉప రవాణాకమిషనర్ భువనగిరి శ్రీకృష్ణవేణి మాట్లాడుతూ ఆటోరిక్షా బాడ్జీల కోసం ఇంతవరకు 8వతరగతి విద్యార్హతలను ప్రామాణికంగా తీసుకుని ఎల్‌ఎల్‌ఆర్, లైసెన్స్‌లు మంజూరు చేశామని తెలిపారు. అయితే విద్యార్హతలలో ప్రభుత్వం సడలించిందని, బాడ్జీలేనివారికి, కొత్తగా ఆటోరిక్షా లైసెన్స్ పొందేవారికి ఇప్పుడు ప్రత్యేక మేళాలలో లెర్నర్ లైసెన్స్ మంజూరు చేస్తామన్నారు. నెలరోజుల తర్వాత లైసెన్స్ ఇస్తామన్నారు. ఇందుకు అభ్యర్ధులు తగిన ఆధారాలతో ప్రత్యేక మేళాకు హాజరు కావాలన్నారు. ప్రాంతీయ రవాణాశాఖాఅధికారి కనకరాజు మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగాప్రత్యేక మేళాలలో పాల్గొని రవాణాశాఖ సేవలను వినియోగించుకోవాలని కోరారు. చాలామంది ఆటోడ్రైవర్లకు బాడ్జీలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, అయితే విద్యార్హతలలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శనివారం నిర్వహించిన మేళాలో 550 మంది సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. ఆదివారం కూడా ప్రత్యేక మేళా నిర్వహిస్తామని, అందువల్ల మిగిలినవారు ఈ అవకాకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటారువాహనాల తనిఖీ అధికారి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధుడి హత్య!
వేపాడ, ఫిబ్రవరి 11: మండలంలోని చినగుడిపాల శివారు పెదబోజంకివానిపాలెం సమీపంలో ఓ వృద్ధుడు హత్యకు గురయ్యాడు. వల్లంపూడి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చినగుడిపాల గ్రామానికి చెందిన బొబ్బిలి సన్నిబాబు (58) శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో గ్రామంలో నుంచి నల్లబిల్లివద్ద గొర్రెల మంద కాపునకు వెళ్లాడు. మార్గమధ్యలో పెదబోజంకివానిపాలెం, నల్లబిల్లి శివారు వారాది కొంపలు సరిహద్దులో తెల్లారే సరికి శవమై కనిపించాడు. మృతుడి తలపైన, ముఖంపైన తీవ్రగాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గ్రామంలో పరదేశమ్మతీర్థం హడావుడిలో ఉన్న కుటుంబ సభ్యులు మృతుడు సన్నిబాబు మందవద్దకు వెళ్లాడా లేదని గ్రహించకపోగా హత్యకు గురైనట్లు ఆలస్యంగా గుర్తించారు. మృతుడు చిన్నకుమారుడు బొబ్బిలి సన్యాసినాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై వల్లంపూడి ఎస్సై ఎస్ కృష్ణమూర్తి కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన హత్యపై ఆరా తీశారు. గ్రామ పెద్దలు, విఆర్వో జగన్నాథం సమక్షంలో శవపంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్.కోట సిఐ బండారు రమణమూర్తి, స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ హత్య జరిగిన తీరును పరిశీలించి అనుమతులను విచారిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
స్వాతంత్య్ర సమర యోధుడు
ఖాదర్ మొహిద్దీన్ మృతి
వేపాడ, ఫిబ్రవరి 11: మండలంలోని వేపాడ గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు షేక్‌ఖాధర్ మొహిద్దీన్ (సోంబాబుఅప్పన్న (94) శనివారం సాయంత్రం మృతి చెందారు. కొంత కాలం నుండి వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న మొహిద్దీన్ ఇంటి వద్దనే మృతి చెందారు. ఈయన భార్య పాతిమాబేగం ఏడాది క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు పదిమంది సంతానం. వారిలో నలుగురు కూతుళ్లు, ఆరుగురు కుమారులు వారిలో ఇద్దరు మృతి చెందారు. అజాద్ హిందు ఫౌజ్ నేత సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఏర్పాటైన సైన్యంలో చేరి స్వాతంత్య్ర సముపార్జనకు పాటుపడిన ఖాదర్‌మొహిద్దీన్‌ను ప్రభుత్వం గుర్తించి పెన్షన్ సదుపాయం కల్పించింది. ఈయన మృతిపట్ల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వాతిరాణి, శోభాహైమావతి, కోళ్ల లలితకుమారి, వివి చినరామునాయుడు, గుమ్మడి భారతి, నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.