విజయనగరం

వండాన కుటుంబానికి న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 20: ఇటీవల మృతిచెందిన దళితుడు వండాన ఉగాది కుటుంబానికి ప్రభుత్వం తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకుల ఆధ్వర్యంలో సోమవారం బాధితుని కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. దళిత నాయకులు బాధితుని కుటుంబానికి మద్దతుగా వౌన దీక్షలో పాల్గొన్నారు. ఈసందర్భంగా దళిత నాయకులు రామవరపుపైడిరాజు, మోహనరావు, చింతపల్లి దుర్గారావు తదితరులు మాట్లాడుతూ నిమ్మకాయల వ్యాపారం చేసుకుంటూ ఆరుగురు పిల్లలతో కూడిన కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వండాన ఉగాదిని, కుటుంబ సభ్యులను ఇటీవల పోలీసులు వేధింపులకు గురిచేయడం వలనే అతను చనిపోయాడని వారు ఆరోపించారు. బాధితుని కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంకల్పించి చిన్న పిల్లలను ప్రభుత్వమే చదివించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుని బార్య సావిత్రమ్మ వేడుకుంది. ఈ ఆందోళనలో దళితనాయకులు బుంగభానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి కమిటీలను తక్షణం రద్దుచేయాలి
విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 20: సర్పంచ్‌ల అధికారాలను హరించే విధంగా ప్రభుత్వం పాలన తీరు ఉందని ఎపి పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ఆరోపించారు. సోమవారం జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద సమరశంఖం కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మామిడి అప్పలనాయడు మాట్లాడుతూ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక చేయాలని అలా కాకుండా జన్మభూమి కమిటీలకు అధికారాలు కట్టబెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు. కేరళ, పశ్చిమ బెంగాల్ మాదిరిగా 73వ రాజ్యాంగ సవరణ కింద 29 శాఖల అధికారాలు విధులు పంచాయతీలకు బదలాయించాలని కోరారు. గతంలో మాదిరిగా పంచాయతీలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. శాసన మండలి ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటా కింద ఎన్నికలకు సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలని సూచించారు. అన్యాయంగా రద్దుచేసిన పంచాయితీ సర్పంచ్‌ల చెక్ పవర్‌ను తిరిగి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. గ్రామ పంచాయితీ తీర్మాణాలు లేకుండా పంచాయితీలను పురపాలక సంఘాలలో విలీనం చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు. గ్రామ పంచాయతీలలో కడుతున్న వ్యిక్తిగత మరుగుదొడ్లకు బిల్లులు వారం రోజుల్లో మంజూరు చేయాలని సూచించారు. ఖాళీగా పంచాయితీ కార్యదర్శి పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. శతశాతం ఉపాధి హామీ నిధులతో పంచాయితీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాని డిమాండ్ చేసారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కర్రోతుసత్యం, పీరుబండి జైహింద్‌కుమార్, రాంబాబు పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
26 మంది రైతులకు పత్రాలు పంపిణీ

విజయనగరం(టౌన్), ఫిబ్రవరి 20: మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులు, రైతుల నుండి వచ్చిన గ్రీవెన్స్‌లు త్వరితగతిన పరిశీలించి పరిరక్షించడం వలన తక్షణం న్యాయం చేయగలమని రెవెన్యూ అధికారులకు జెసి శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ సూచించారు. కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామానికి చెందిన 26 మంది రైతులకు సుమారు ఎనిమిది ఎకరాల భూమిపై సాగు హక్కు పత్రాలు( ఒన్ బి అడంగల్) సోమవారం గ్రీవెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో సంబంధిత రైతులకు అంద చేసారు. గ్రీవెన్స్ వినతులు పరిష్కారం అయితే వారిలో ఎంతో సంతృప్తి ఉంటుందని అన్నారు. భూములను సాగు చేసుకుని జీవనం సాగించాలని సూచించారు. సాగు హక్కు పత్రాలు అందుకున్న రైతులు జెసిని పుష్ప గుచ్ఛంతో అభినందించారు. తమ సమస్య పరిష్కారం అయిందని వారంతా అనందం వ్యక్తం చేసారు.