విజయనగరం

ముగిసిన నామినేషన్ల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 20: ఉత్తరాంధ్ర పట్ట్భద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఇబ్బడిముబ్బడిగా అభ్యర్థులు పోటీ పడ్డారు. నామినేషన్లు ముగిసే సమయానికి 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నాంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తి కావడంతో ఇక అభ్యర్థులు తమ పూర్తి సమయాన్ని ప్రచారంపై దృష్టి సారించనున్నారు. చివరి రోజున నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బి.లక్ష్మినారాయణ, బివివి సత్యనారాయణ, సిహెచ్ శేషగిరిరావు, చల్లా ఎర్రినాయుడు, జి.రవీంద్రకుమార్, కె.జైరూప్, కొత్తకోట సింహాద్రిఅప్పడు, లగుడు గోవింద్, పి.శ్రేష్‌కుమార్, ఆర్.వెంకట్రామన్, ఎస్.్భగ్యలక్ష్మి, కె.ఉదయశ్రీ, టి.పరమేశ్వర సూర్యచంద్రరావులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా ఈ దఫా ఎన్నికల్లో టిడిపి, వైకాపాలు తమ అభ్యర్థిని బరిలోకి దించలేదు. ఎన్నికల పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థి పివిఎన్ మాధవ్‌కు టిడిపి తమ మద్దతు పలికింది. వామపక్షాల నుంచి పిడిఎఫ్ అభ్యర్థి అజశర్మ, కాంగ్రెస్ నుంచి యడ్ల ఆదిరాజు తదితరులు బరిలో నిలిచారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపట్నంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరితో పరిచయాలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు తనకు వైకాపా నుంచి కూడా మద్దతు ఉందని చెబుతున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన ఎంబి అప్పారావు తదితరులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక పిడిఎఫ్ తరఫున బరిలో నిలిచిన అజశర్మకు వామపక్షాల మద్దతు ఉంది.
ఇటీవల ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తదితరులు ఆయన తరఫున ఉత్తరాంధ్రలో పర్యటించి మద్దతు తెలిపారు. మరోపక్క టిడిపి మద్దతునిస్తున్న పివిఎన్ మాధవ్‌కు తెలుగుదేశం నేతలు సహకరిస్తే వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే బిజెపి పట్ల జనంలో ఆదరణ ఉండటంతో ఈయన గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు మరో రెండు రోజులు గడువు ఉండటంతో చివరకు బరిలో నిలిచేది ఎంత మంది అన్నదీ స్పష్టం కాగలదు.
జోరుగా భవనాల శిథిలాల తొలగింపు
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 20: పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపుజోరుగా జరుగుతోంది. మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వి.శోభన్‌బాబు, కె.హరిదాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చురుకుగా జరుగుతోంది. కోట జంక్షన్ నుంచి లయన్స్‌కమ్యూనిటీ హాలు వరకు, సింహాచలం మేడ నుంచి బాలాజీ జంక్షన్ వరకు రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలతోపాటు భవనాల తొలగింపు దాదాపుగా పూర్తయింది. అదేవిధంగా కొత్తపేట నీళ్ల ట్యాంకు నుంచి అంబటి సత్రం జంక్షన్ వరకు ఆక్రమణలు, భవనాల తొలగింపు చురుకుగా జరుగుతోంది. వాహనాలు, పాదచారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూల్చివేసిన భవనాల శిథిలాలలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. పట్టణంలో గంటస్తంభం జంక్షన్ నుంచి పాతబస్టాండ్ వరకు చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు దాదాపుపూర్తయ్యాయి. అదేవిధంగా దాసన్నపేట రైతుబజారు జంక్షన్ నుంచి కొత్తపేట నీళ్లట్యాంకు వరకు రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చురుకుగా జరుగుతున్నాయి. భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపుపూర్తయిన వెంటనే మిగతా రోడ్ల విస్తరణ, అభివృద్ధిపనులను ప్రారంభిస్తారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రైవేటు వాహనాలు నిలిపివేత
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 20: పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రైవేటువాహనాలను నిలిపివేయడం వల్ల ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలగడమేకాకుండా ఆర్టీసీ ఆదాయానికి కూడా గండిపడుతోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ప్రైవేటువాహనాలను నిలపరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ, యధేచ్చగా వాహనాలను నిలిపివేస్తున్నారు. అయినప్పటికీ ఆర్టీసీ సెక్యూరిటీ విభాగం అధికారులు కనీసం పట్టించుకోవడంలేదు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ప్రైవేటు వాహనాలను నిలపరాదని, మోటారు చట్టాలను ఉల్లంఘించి వాహనాలను నిలుపుదల చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డులు దిష్టిబొమ్మలా ఉంటున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన గేటు వద్ద ఆటోలతోపాటు ఇతర ప్రైవేటు వాహనాలను నిలుపుదల చేయడం వల్ల ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే ప్రయాణికులు నానా ప్రయాస పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఆర్టీసీ సెక్యూరిటీ అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక్కడ ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల వల్ల ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని రీజనల్‌మేనేర్ పి.అప్పన్న దృష్టికి తీసుకువెళ్లగా నిస్సహాయత వ్యక్తం చేశారు. దీనికితోడు ఆర్టీసీ పరిరక్షణ కోసం యాజమాన్యం తీసుకున్న చర్యలు కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొద్దిరోజులు హడావిడి చేసిన సెక్యూరిటీ అధికారులు ఇప్పుడు కనీసం పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా ప్రైవేటు వాహనాలను లేకుండా చూడాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి
టిడిపి నాయకులు కృషిచేయాలి

బొబ్బిలి, ఫిబ్రవరి 20: శాసనమండలి ఎన్నికల్లో మిత్రపక్షమైన ఎమ్మెల్సీ అభ్యర్థి ఘన విజయానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు నడుంబిగించాలని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు పిలుపునిచ్చారు. స్థానిక రాజ్ దర్బార్‌లో సోమవారం బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ నాయకుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయి నుంచి ఎమ్మెల్సీ విజయానికి నాయకులు దోహదం చేయాలని తీర్మానించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వానికి సంబంధించిన ఇళ్లు, పింఛన్లు ఆన్‌లైన్ ద్వారా పొందుపరుస్తున్నారని, వీటిలో కొన్ని నిబంధనలను సడలింపు చేయాల్సి ఉందని తీర్మానించారు. నిబంధనలను అనుసరించి ఇళ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని, వీరిని దృష్టిలో ఉంచుకుని సడలింపు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్‌చార్జి తెంటు లక్ష్మునాయుడు, చైర్‌పర్సన్ అచ్యుతవల్లి, వైస్ చైర్మన్ సిహెచ్.రమేష్‌నాయుడు, ఏఎంసి చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, టిడిపి రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి తూముల భాస్కరరావు, అప్పికొండ శ్రీరాములనాయుడు, తదితరులు పాల్గొన్నారు.