విజయనగరం

మెరుగైన సేవలు అందించండి...ఆదాయం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 28: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి, తద్వారా ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని ఆర్టీసీ విజయనగరం ఇన్‌ఛార్జి రీజనల్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ కోరారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిపోమేనేజర్లతో మంగళవారం ఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న నష్టాలకు కళ్లెం వేసేందుకు, ఆక్యుపెన్సీరేషియో పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను నడపాలని తెలిపారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని బస్‌స్టేషన్‌లలో మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. మార్చి ఒకటోతేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నందున పల్లెవెలుగు బస్సులను సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రవాణా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ముఖ్యంగా ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, డ్రైవర్లను, కండక్టర్లను అప్రమత్తం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం డిప్యూటీ చీఫ్‌ట్రాఫిక్‌మేనేజర్ కుప్పిలి శ్రీనివాసరావు, డిపోమేనేజర్లు కె.పద్మావతి (విజయనగరం), ఎన్‌విఎస్ వేణుగోపాల్ (ఎస్.కోట), శివకుమార్ (సాలూరు), బివిఎస్ నాయుడు (పార్వతీపురం), శ్రీనివాసరావు(పాలకొండ), ఢిల్లేశ్వరరావు(శ్రీకాకుళం-1), అరుణకుమారి (శ్రీకాకుళం-2), ముకుందరావు(టెక్కలి), సిమ్మన్న (పలాస), ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారి ముత్తిరెడ్డి సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.

ఫీక్‌సీజన్ దృష్ట్యా అదనపుసిబ్బందిని నియమించాలి
* ఆర్టీసీ ఇయు రీజనల్ కమిటీ విజ్ఞప్తి

విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 28: పీక్‌సీజన్, వేసవి ఎండల కారణంగా కార్మికులు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉన్నందున అదనపుసిబ్బంది నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఇయు) రీజనల్ కమిటీ కార్యదర్శి పి.్భనుమూర్తి కోరారు. ఈ మేరకు ఇన్‌ఛార్జి రీజనల్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్‌కు మంగళవారం ఒక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భానుమూర్తి మాట్లాడుతూ ప్రతీ పీక్‌సీజన్‌లో ఎండల తీవ్రత వల్ల చాలామంది కార్మికులు మెడికల్ లీవులు పెడుతుంటారని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని క్రూ నారమ్స్ ప్రకారం 2.70 గా పరిగణించి అదనపుడ్రైవర్లు, కండక్టర్లను నియమించేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా రీజియన్ పరిధిలో అన్ని డిపోలలోను, గ్యారేజిలలోను, బస్‌స్టేషన్‌లలోను పరిశుభ్రమైన మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. అన్ని విశ్రాంతి గదులు నివాసయోగ్యంగా ఉండేటట్లు అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోశాధికారి జి.రవికాంత్, రీజనల్ సహాయ కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
============