విజయనగరం

దండయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 11: రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగకుంటే ఉద్యమించక తప్పదని వైకాపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. మహిళలకు రక్షణ కరువైందని, చంద్రబాబు ప్రభుత్వంపై దండయాత్ర తప్పదన్నారు. శనివారం ఆమె ఇక్కడ వైకాపా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఒక్కొ గ్రూపునకు రూ.3వేలు ఇచ్చి చేతులు దులుపేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు రానున్న బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు జరపాలన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు 2019 కంటే ముందుగా వచ్చిన వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులుగా ఉండాలన్నారు. అందువల్లనే పార్టీలో నాలుగు విభాగాలను పటిష్టం చేసేందుకు నియామకాలు జరుపుతున్నామన్నారు. మండలాల్లో విద్యార్థి, యువజన, మహిళా, రైతు విభాగాలలో ఒక్కో విభాగానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తామన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నందున అవసరాన్ని బట్టి మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్ధానాలు పెరిగే అవకాశం ఉందని, విజయనగరం జిల్లాలో కూడా రెండు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని ఆయన వివరించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు హోం మంత్రిత్వశాఖ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ
వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఓక్కరు కృషి చేయాలన్నారు. పార్టీ పటిష్టంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపుఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి దుర్గాప్రసాద్‌రాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజ, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, వైకాపా సీనియర్ నాయకులు పి.సాంబశివరాజు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పరిశోధనలు కీలకం

విజయనగరం, మార్చి 11: దేశ ప్రగతికి పరిశోధనలు ఎంతగానో దోహదపడతాయని భారత శాస్త్ర, సాంకేతిక విభాగాధిపతి డాక్టర్ రాజీవ్‌శర్మ అన్నారు. శనివారం ఆయన ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరిశోధన ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా మురికినీటిలోని బయటకు తీసే విధానం, కాఫీ వ్యర్థాలు, పామ్‌ఎరా పండ్ల తిత్తులను ఉపయోగించి పరిశోధనలు చేస్తారని తెలిపారు. ఈ కళాశాలలో ఆటోమేటిక్ ఎబ్జార్వేషన్ స్పెక్ట్రో మీటర్ వంటి పరికరాలను సమకూర్చుకోవడం ఆనందదాయకమన్నారు. అనంతరం కళాశాలలో చేపట్టిన వివిధ పరిశోధనా ప్రాజెక్టులను పరిశీలించారు. పరిశోధనలు ఎంత వరకు జరిగాయో ఆరా తీశారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాన్సాస్ కరెస్పాండెంట్ డాక్టర్ డిఆర్‌కె రాజు, డైరెక్టర్ భాస్కరరెడ్డి, ఎంఆర్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ఉదయభాస్కర్, డాక్టర్ ఆర్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.