బిజినెస్

కొరియాకు విజయనగరం మామిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 27: విజయనగరం జిల్లాలో మామిడి పంటకు గిరాకీ పెరిగింది. ఇప్పటివరకు ఢిల్లీ, నాగపూర్ వంటి దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న మామిడిని తొలిసారిగా కొరియాకు ఎగుమతి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కొరియాకు చెందిన డాంగ్‌ఊ ఇంటర్నేషనల్ సంస్థ, హైదరాబాద్ మ్యాంగో జ్యూస్ ఎయిర్‌కార్గో డెవలప్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌తో చర్చించారు. విధి విధానాలపై మాట్లాడారు. మళ్లీ మరోసారి భేటీ కానున్నట్టు ప్రకటించారు. జిల్లాలో పండుతున్న బంగినపల్లి మామిడికి దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం ఉన్న విషయం తెలిసిందే.