విజయనగరం

బాలల భద్రత సామాజిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 29: బాలల భద్రత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఐసిడిఎస్ పిడి రాబర్ట్స్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర ప్రతినిధి ఎస్.బి.బాలరాజు పిలుపునిచ్చారు. శనివారం ఐఎంఎ హాల్లో నేచర్ చైల్డ్‌లైన్ సంస్థ వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ బాలల్లో నిస్సహాయ స్థితికి కారణాలను, సమస్యలను గుర్తించి అమల్లో ఉన్న చట్టాలు, పథకాలతో వాటికి పరిష్కారం చూపాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికులు, వలసలు, అక్రమ రవాణా, ఆరోగ్య సమస్యలు, లైంగిక వేధింపులపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. మారుమూల ప్రాంతాలలో జాగృతి శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నేచర్, చైల్డ్ ఫండ్ ఇండియా, చైల్డ్‌లైన్‌ల ఆధ్వర్యంలో సామర్థ్యం పెంపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యకర సమాజం మనందరి సామాజిక అవసరమని తీర్మాణించారు. జిల్లా సమాలోచన సదస్సు ఉపయోగాలను, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఉమ్మడిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర ప్రబంధకురాలు గంటా హైమవతి, డిసిహెచ్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉషశ్రీ, డాక్టర్ కిశోర్, డాక్టర్ రాఘవరావు, ఎస్‌ఎస్‌ఎ నుంచి నాగేశ్వరరావు, సత్యవతి, సిఐ వెంకట్రావు పాల్గొని సూచనలను అందజేశారు.