విజయనగరం

బూత్ కమిటీలను పటిష్టం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 27: సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీలను పటిష్టం చేయాలని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం అశోక్‌బంగ్లాలో టిడిపి జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీలన పటిష్టం చేయడంతోపాటు బూత్ లెవెల్ ఏజంట్ల నియామకం చేపట్టాలని ఆయన సూచించారు. జిల్లా అనుబంధ కమిటీలతోపాటు మిగిలిపోయిన మండల, పట్టణ కమిటీలను పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వెబ్‌ల్యాండ్‌లో రైతుల భూములకు, వాస్తవానికి పొంతన కుదరడం లేదని సమావేశంలో తెలుపగా వాటిని సరిచేయించాలని ఆదేశించారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు విజృంభించినపుడు సహాయక చర్యలు చేపట్టడంలో శ్రేణులు భాగస్వాములు కావాలన్నారు. నీరు, ప్రగతి కార్యక్రమంలో చేపిన పనులకు, చంఅదన్నబాట కార్యక్రమంలో చేపట్టిన సిసి రోడ్లు, కాలువలు పనులకు సంబంధించి బిల్లులు మంజొరు చేయకాలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన బిల్లలు చెల్లిపులు జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావడంతోపాటు వాటిని పరిరక్షించాలని ఆయన కోరారు. అనంతరం పార్టీ జమ, ఖర్చుల గురించి ఆరా తీశారు. ఈ సమావేశంలో గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యేలు గీత, కోళ్ల లలితకుమారి, పతివాడ నారాయణస్వామినాయుడు, కెఎ నాయుడు, చిరంజీవులు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రైల్వే సమస్యలపై దృష్టి సారించండి:వైకాపా
చీపురుపల్లి, జూన్ 27: చీపురుపల్లి రైల్వేస్టేషన్‌లో తిష్టవేసిన సమస్యలపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, స్థానిక ఎమ్మెల్యే మృణాళిని దృష్టి సారించాలని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మరోనాయకుడు ఇప్పిలి అనంత్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చీపురుపల్లి రైల్వేస్టేషన్ చుట్టు ప్రక్కల సుమారు తొమ్మిది మండలాల ప్రజలకు ఉపయోగంలో ఉన్నా అందుకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీపురుపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జినిర్మాణం చెయ్యడం ద్వారా ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదాలు జరగుకుండా ఉంటుందన్నారు. ప్రయాణీకుల దర్దీని దృష్టిలో ఉంచుకొని గతంలో ఉన్న తత్కాల్ రిజర్వేషన్ సౌకర్యాన్ని పునరుద్దరించాలని కోరారు. అలాగే రిజర్వేషన్ టైమింగ్స్‌ను కూడా ప్రయాణీకులకు అనుకూలంగా మార్పులు చెయ్యాలని సూచించారు. అంతేకాకుండా జిల్లాలో విజయనగరం తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చే స్టేషన్ చీపురుపల్లేనని దానిని దృష్టిలో ఉంచుకొని ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లను ఆపించే వెసులుబాటును కల్పించాలన్నారు. మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మీ సుమారు రూ.60లక్షల నిధులతో చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశారని, తర్వాత పట్టించుకొనేవారే లేరన్నారు. జిల్లాలో కేంద్ర మంత్రి పదవి ఉండి కూడా ఇక్కడి నాయకులు రైల్వేస్టేషన్ అభివృద్ధిపై దృష్టిసారించడంలేదని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా చీపురుపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధిపై చిత్తశుద్ధితో కృషిచెయ్యాలని ఆ నాయకులు కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు కరిమజ్జి శ్రీనివాసరావు, రఘుమండ త్రినాధ్, రేవళ్ల సత్తిబాబు, కంది పాపినాయుడు, మీసాల విశే్వశ్వరరావు, అధికార్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.