విజయనగరం

ఉపాధి హామీ పనులకు జియో ట్యాగ్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 19: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి జియో ట్యాగ్ తప్పనిసరి అని జాయింట్ కమిషనర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన సామాజిక తనిఖీ అధికారులు, ఎంపిడిఒలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఇక్కడ జిల్లా స్థాయి ప్రజావేదిక (డిస్ట్రిక్ పబ్లిక్ హియరింగ్) నిర్వహిస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే మిగిలిన జిల్లాలకు వర్తింపజేస్తామన్నారు. ఇప్పటి వరకు గ్రామాలు, మండల స్థాయిలలో మాత్రమే ప్రజావేదికను నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో వివిధ మండలాల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. గంట్యాడ మండలం డికె పర్తిలో ఫారం పాండ్స్‌కు సంబంధించి 25 పనులు జరగకుండానే రూ.7.71 లక్షలు నిధులు డ్రా చేశారని సామాజిక తనిఖీల్లో వెల్లడైందన్నారు. అలాగే ఉపాధి హామీలో రికార్డులో పనులకు, క్షేత్రస్థాయి పనులకు వ్యత్యాసం రాకూడదన్నారు. అన్ని రకాల పనుల్లో వ్యత్యాసం అని చెప్పడం సమంజసం కాదన్నారు. స్లోప్ పిట్స్ ఇతర రకాల వాటిలో వ్యత్యాసం ఉండవచ్చని, రోడ్ల విషయంలో కూడా వ్యత్యాసం ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. సీతానగరం మండలంలోని పెదబోగిలి, దయానిధిపురంలో పనులు జరగకుండానే రూ.5.19 లక్షలు డ్రా చేశారని సామాజిక తనిఖీ అధికారులు తెలుపగా పనులు జరగకుండా డబ్బులు ఎందుకు డ్రా చేశారని ప్రశ్నించారు. ఇప్పటికీ ఐదు నెలలు గడుస్తున్నా నేటికి పనులు పూర్తి కాలేదని వారు తెలిపారు. ఇదిలా ఉండగా రామభద్రాపురం మండలంలోని రావివలసలో రెండేళ్లుగా పని కల్పించమని అడిగితే నేటి వరకు పనులు కల్పించలేదని సామాజిక తనిఖీ అధికారులు తెలుపగా అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందని జాయింట్ కమిషనర్ ప్రశ్నించారు. దీనికి అక్కడ ఇసి మాట్లాడుతూ అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల పని కల్పించలేదని బదులిచ్చారు. దీనిపై అలాంటి పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యానికి గండికొట్టే విధంగా వ్యవహరించరాదని సూచించారు. ఈ సమావేశంలో జెసి నాగేశ్వరరావు, సాట్ (సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ) డైరెక్టర్ జి.శ్రీకాంత్, డ్వామా పిడి రామచంద్రరావు పాల్గొన్నారు.

మానవత్వం చాటిన ఆదర్శపాఠశాల విద్యార్థులు
* తోటి విద్యార్థి కంటిచూపునకు రూ.1.62 లక్షలు విరాళం
కొత్తవలస, సెప్టెంబర్ 19: తమతో గంతులువేస్తూ ఆడుతూపాడుతూ చదువుకున్న విద్యార్థికి ఒక్కసారిగా కంటిచూపు కోల్పోయి అంధకారం అలముకున్న సందర్భంలో తోటి విద్యార్థులు బాసటగా నిలిచిన వైనం కొత్తవలస ఆదర్శపాఠశాలలో జరిగింది. మాడుగులు శ్రావణి అనే విద్యార్థిని 8వ తరగతి పూర్తిచేసి 9లో అడుగుపెట్టింది. ఇంతలోనే తెలియని జబ్బుతో కంటిచూపు మొత్తం కోల్పోయింది. ఆ తరగతికి ఆ విద్యార్థినే టాపర్. అంధత్వంతో పాఠశాలకు రాని స్థితి, పేదకుటుంబం వలన వైద్యం అందించలేని పరిస్థితి దాపురించింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల విద్యార్థులు చందాలు వేసుకుని వారి స్నేహితులు, తల్లిదండ్రుల వద్ద నుండి విరాళాలు సేకరించి 1.62,348రూపాయలు మంగళవారం ప్రిన్సిపాల్ కె.పార్వతి చేతులమీదుగా తల్లిదండ్రులకు అందించారు. వారి మానవత్వానికి నివ్వెరపోయారు. స్థానిక జెడ్పీటిసి రమణమ్మ, కోళ్లశ్రీను వీరి సహాయాన్ని చూసి నివ్వెరపోయారు. విద్యార్థిని రావడంతో తోటి విద్యార్థులంతా కన్నీటి పర్యమయ్యారు.

రామారాయుడు రోడ్డులో ఆక్రమణల తొలగింపు

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: పట్టణంలో రామారాయుడు రోడ్డులో మంగళవారం ఆక్రమణలను తొలగించారు. ఈ తొలగింపు చర్యలను మున్సిపల్ కమిషనర్ డి.అనిత పరిశీలించారు. స్ధానిక మహారాజా కళాశాల జంక్షన్‌నుంచి ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్ వరకు రోడ్డు సెఫ్టీ డిఎస్పీ గురుమూర్తి, మున్సిపల్ అసిస్టెంట్ సిటీప్లానర్లు శోభన్‌బాబు, హరిదాస్ ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా ఆక్రమణదారులు, మున్సిపల్, పోలీస్ అధికారుల మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. ప్రత్యామ్నాయం చూపకుండా ఆక్రమణలను తొలగించడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డును ఆనుకుని ఉన్న పెద్దచెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించిన నేపధ్యంలో ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ రోడ్డులో ఆక్రమణలు పెరిగిపోవడంవల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కావడంతో వాహనచోదకులు, పాదచారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను మున్సిపల్ కమిషనర్ అనిత ఆదేశించారు.