విజయనగరం

సరుకు రవాణాలో ఆర్టీసీ అగ్రగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(్ఫర్టు), సెప్టెంబర్ 22: ప్రజా రవాణాలోనే కాకుండా సరుకు రవాణాలో కూడా ఆర్టీసీ అగ్రగామి సంస్థగా ప్రముఖపాత్ర వహిస్తుందని విజయనగరం రీజయన్ అసిస్టెంట్ ట్రాఫిక్‌మేనేజర్(కమర్షియల్) ముత్తిరెడ్డి సన్యాసిరావుఅన్నారు. స్థానిక బస్‌స్టాండ్‌లో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సరుకు, పార్శిల్ రవాణాలో నాణ్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. అతి తక్కువ ఖర్చులతో భద్రంగా, వేగంగా సరుకు రవాణా చేస్తామన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో చీపురుపల్లి, సాలూరు, రామభద్రపురం, పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, ఎస్.కోట, కొత్తవలస, అరుకు, ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, బత్తిలి, కొత్తూరు, అమదాలవలస, పాలకొండ, ఉంగరాలమెట్ట, రాజాం ప్రాంతాలలో లగేజీ కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, బరంపురం, జయపూర్, గుణుపూర్ వంటి అంతర్రాష్ట్రాలకు కూడా త్వరితంగా సరుకు రవాణా చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రూ. 7 కోట్లతో సబ్‌స్టేషన్ ఏర్పాటు: ట్రాన్స్‌కో డిఇ
బొబ్బిలి, సెప్టెంబర్ 22: పార్వతీపురం ఎలక్ట్రికల్ డివిజన్ పరిధిలో గ్రామీణ దీనదయాల్ ఉద్యోగ పథకం కింద సుమారు 7కోట్ల రూపాయలతో సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వాటిని వచ్చేనెలాఖరు నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ట్రాన్స్‌కో డిఇ మసిలామణి తెలిపారు. శుక్రవారం ట్రాన్స్‌కో కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొమరాడ మండలంలో గంగరేగువలసలో కోటి 20లక్షల రూపాయలు, జియ్యమ్మవలసలోని చినకొదమలో కోటి 50లక్షలు, బొబ్బిలి మండలం ఎన్‌ఎస్‌పేటలో కోటి 40లక్షల రూపాయలు, పెంటలో కోటి 20లక్షల రూపాయలు, మక్కువ మండలం యర్రసామంతవలసలో కోటి 60లక్షల రూపాయలతో వీటిని నిర్మిస్తున్నామన్నారు. బొబ్బిలిలో కోటి 35లక్షల రూపాయలతో సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకంద్వారా సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న హెడ్ క్వార్టర్స్ కలువరాయి, వంతరాం, బూర్జ, మావుడి, పినపెంకి, గంగన్నదొరవలస, కొట్టు గ్రామాల్లో 24గంటలు విద్యుత్‌ను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం ప్రాంతాల్లో హైక్వాలిటీ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని, 56,385 మీటర్లకు ఇంతవరకు 51వేల 254మీటర్లు వేశామన్నారు. దశల వారీగా డివిజన్ అంతా హై క్వాలిటీ మీటర్లు వేస్తామన్నారు. ఎన్‌టి ఆర్ జలసిరి పథకం ద్వారా డివిజన్‌లో 1332 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇందులో 1320మందిని అర్హులుగా గుర్తించామన్నారు. ప్రస్తుతం 245మందికి సోలార్‌సిస్టంలను ఏర్పాటుచేశామని, మరో 674మందికి ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. సాధారణ సోలార్ సిస్టం కోసం 590మంది దరఖాస్తులు చేశారని, వీరిలో 523మంది అర్హత పొందారని, దీనిలో 408మంది మొత్తాలను చెల్లించారన్నారు. వీటిలో 280మందికి కనెక్షన్లు ఇచ్చామన్నారు. డివిజన్‌లో 11కెవి ఫీడర్లు 137 ఉన్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా పనిచేసేందుకు మరికొన్ని ఫీడర్ల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. అలాగే 33కెవి ఫీడర్లు 20 ఉన్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా లైన్లు, కనెక్షన్లు చేసేందుకు ప్రతిపాదించామన్నారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.