విజయనగరం

మాంగనీస్ దొంగలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, సెప్టెంబర్ 22: మండలంలోని తోణాం పంచాయతీ పూతికవలస గ్రామ సమీపాన మెట్టలో అక్రమంగా మాంగనీస్ తవ్వకాలు జరిపి లారీలో లోడుచేసి తరలిస్తుండగా అటవీ అధికారులు గురువారం రాత్రి పట్టుకున్నారు. ఈమేరకు పూతికవలస రిజర్వు ఫారెస్టు భూములలో తవ్వకాలు చేస్తున్నారని సమాచారం అందడంతో అటవీ సిబ్బంది దాడి చేశారు. గ్రామ సమీపంలో ఉన్న జీడితోటలో మాంగనీస్ ఖనిజాన్ని నిల్వ చేసి ఉంచారు. గత కొంతకాలంగా రహస్యం మాంగనీస్ తవ్వకాలు చేస్తు రాత్రి వేళల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తోణాం ఫారెస్టు గార్డు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి మాంగనీస్ లోడుతో ఉన్న లారీని పట్టుకున్నారు. శుక్రవారం ఫారెస్టు రేంజర్ అమ్మన్నాయుడు పూతికవలస వెళ్లి మాంగనీస్ లారీని సీజ్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం కడప జిల్లాకు చెందిన ఎస్‌వి నారాయణరెడ్డి అనే వ్యాపారవేత్త ఈ ప్రాంతంలో మాంగనీస్ తవ్వకాలు అనుమతి కావాలని దరఖాస్తు చేశాడు. తరువాత ఆయన ఎస్‌జిఎస్ మినరల్స్ అనే సంస్థకు పవర్ ఆఫ్ అటార్నీ అప్పగించారు. 2016 మార్చిలో ఎస్‌జిఎస్ మినరల్ సంస్థ ప్రతినిదులు అటవీ అధికారులు మండల సర్వేయర్‌తో కలిసి జాయింట్ సర్వే నిర్వహించారు. మాంగనీస్ తవ్వకాల కోసం అనుమతులు కోరిన భూముల సరిహద్దులను నిర్ధారించారు. ఇంతవరకు నిర్ధేశించిన ప్రాంతంలో మాంగనీస్ తవ్వకాలకు ఎటువంటి అనుమతి మంజూరుకాలేదు. అయితే కొంతమంది స్థానికుల సహకారంతో వ్యాపారులు తవ్వకాలు చేసి మాంగనీస్ ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీశ్రీనివాస లారీ సర్వీసు అనే పేరుతో ఉన్న వాహనంలో తరలిస్తుండగా అటవీ సిబ్బంది అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. మండల మైనింగ్ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు రాలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
మాంగనీస్ లారీని సీజ్ చేశాం
పూతికవలస రిజర్వు ఫారెస్టు భూములలో అక్రమంగా మాంగనీస్ తవ్వకాలు చేసి తరలిస్తున్న లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఫారెస్టు రేంజర్ అమ్మన్నాయుడు తెలిపారు. అన్ డిటేక్టడ్ డిఫెండర్ రిపోర్టు(యుడిఓఆర్) కింద కేసు నమోదు చేశామన్నారు. లారీ ఎవరిదో విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అటవీశాఖ నుంచి ఎటువంటి అనుమతులు మంజూరుకాలేదని తెలిపారు.

కొలిక్కిరాని సంస్థాగత ఎన్నికల ప్రక్రియ
* టిడిపి అనుబంధ కమిటీల నియామకమెప్పుడు?

విజయనగరం, సెప్టెంబర్ 22: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నేటి వరకు కొలిక్కిరాలేదు. మహానాడు ముగిసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్న నేటి వరకు టిడిపి అనుబంధ కమిటీల నియామకాలు పూర్తి కాలేదు. సాధారణంగా మహానాడుకు ముందరే టిడిపి జిల్లా కార్యవర్గం, అనుబంధ కమిటీల నియామకాలు జరిపేవారు. ఈ దఫా మాత్రం అనుబంధ కమిటీల నియామక ప్రక్రియ కొలిక్కి రాలేదు. దాంతోపాటు జిల్లా కార్యవర్గం నియామకం కూడా పూర్తి కాలేదు. కేవలం టిడిపి జిల్లా అధ్యక్షుడుగా మహంతి చిన్నంనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఐవిపి రాజు పేర్లను ప్రకటించి అధిష్టానం చేతులు దులుపుకుంది. ఇక జిల్లా కార్యవర్గం, జిల్లా తెలుగు యువత, తెలుగు రైతు, తెలుగు మహిళ, ఎస్సీ, బీసీ, సాంస్కృతిక సంఘం కార్యవర్గాలు ఇలా మొత్తం 13 అనుబంధ కమిటీల నియామకాలు భర్తీ కాలేదు.
తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీల నియామక ప్రక్రియ జరగకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ కమిటీ వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కొనసాగనుండంతో ఎవరికి ఏ పదవిని కట్టబెట్టాలనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్నారు. దీంతో నియామక ప్రక్రియను కొలిక్కి తీసుకురాలేకపోయారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, జిల్లాకు చెందిన మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఇలా ముగ్గురు మంత్రులు ఉన్నా సంస్ధాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఇక ఎప్పటికీ ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నదీ సందేహమే. మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఎక్కువ మంది పార్టీ పదవుల కోసం ప్రాకులాడుతున్నారు. దీంతో పోటీ ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఎప్పటికి ముగుస్తుందన్నదీ ప్రశ్నార్థకమే.

చురుగ్గా సంతకాల బ్రిడ్జి నిర్మాణం పనులు
* నెలాఖరు నాటికి సిద్ధం

విజయనగరం, సెప్టెంబర్ 22: పట్టణంలోని సంతకాల బ్రిడ్జి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో బ్రిడ్జి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల్ల జాప్యం జరిగింది. దీనిపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు పరిశీలించి పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి ముందర పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా, ర్యాంప్ నిర్మాణం జరుగుతొంది. పనులు వేగవంతమయ్యాయని నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయగలమని రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ బ్రిడ్జికి సబ్ వే నిర్మాణానికి మరికొంత సమయం పట్టవచ్చని అంటున్నారు. ప్రస్తుతం పిలిచిన టెండర్ల ప్రకారం సంతకాల బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సబ్ వే నిర్మాణం మున్సిపాల్టీ చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి రెండు కేటగిరీలలో మొత్తం రూ.19 కోట్లు కేటాయించారు. ఏది ఏమైనప్పటికీ నెలాఖరు నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.