విజయనగరం

వచ్చే నెల 25 నాటికి ఎఫ్‌ఎంబి డిజిటలైజేషన్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 25: ఎఫ్‌ఎంబి డిజిటలైజేషన్‌కు సంబంధించి సక్రమంగా పనిచేయని సర్వేయర్లపై వేటు వేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ లఠ్కర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే నెల 25 నాటికి ఎఫ్‌ఎంబి రికార్డులు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. అన్ని గ్రామాల్లో ఎఫ్‌ఎంబిలను శతశాతం డిజిటలైజేషన్, క్వాలిటీ చెక్, డిజిటల్ సంతకం పూర్తి చేయాల్సిందేనన్నారు. డిజిటలైజేషన్‌కు కమిషనర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. అలాగే సర్వేయర్లు సరైన సమాచారం అందజేయకపోవడంతో వారికి ఒకపూట శిక్షణనివ్వాలని ఇన్‌ఛార్జి ఎడిని ఆదేశించారు. జిల్లాలో దాదాపు 1.99 లక్షలు ఎఫ్‌ఎంబిలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉండగా 1.66 లక్షలు పూర్తయ్యాయన్నారు. గ్రామాల వారీగా 90 శాతం డిజిటలైజేషన్ పూర్తయినవి ఎ కేటగిరీ కింద విభజించారు. అదే విధంగా 50 నుంచి 90 శాతం ఉన్న వాటిని బి కేటగిరీ, 50 శాతం కంటే తక్కువ ఉన్న వాటిని సి కేటగిరీగా పేర్కోన్నారు. ఇదిలా ఉండగా సక్రమంగా పనిచేయని సర్వేయర్లపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ రాజ్‌కుమార్, సర్వే ల్యాండ్ రికార్డుల ఇన్‌ఛార్జి ఎడి బిఎల్ నారాయణ, సూపరింటెండెంట్ రాంబాబు, సర్వేయర్లు, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
* ఎమ్మెల్యే గీత
విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 25: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం 37వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గీత మాట్లాడుతూ రాష్టవ్రిభజన తర్వాత ఆర్థికపరిస్థితి ఏమాత్రం బాగోలేనప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడా రాజీ పడలేదన్నారు. చంద్రన్న సంక్రాంతి, చంద్రన్న తోఫా, చంద్రన్న భీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి పేదలకు భరోసా కల్పిస్తూ అండగా ఉంటున్నారని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ప్రయోజనం పొందాలని ఆమె కోరారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ సైలాడ త్రినాధరావు, మున్సిపల్‌వైస్‌చైర్మన్ కనకల మురళీమోహనరావు, తెలుగుదేశంపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దాల ముత్యాలరావు, పట్టణ ఉపాధ్యక్షుడు తోలాపి మోహనరావు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు నరసింగరావు, పార్టీ నాయకులు పసగాడ రామకృష్ణ, ప్రకాశరావుతదితరులు పాల్గొన్నారు.