విజయనగరం

బాలామృతంలో తేడాలు వస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తిరాజేరు, అక్టోబర్ 12: బాలింతలు, గర్భిణులకు బాలామృతం పథకం వర్తింపచేయడంలో తేడాలు వస్తే అంగన్‌వాడీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని గజపతినగరం ఐసిడిఎస్ సిడిపిఒ రమణమ్మ హెచ్చరించారు. మండలంలోని దత్తి, దత్తివెంకటాపురం, దత్తిరాజేరు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న కార్యకర్తల, ఆయాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. కొంతమంది కార్యకర్తలు అంగన్‌వాడీ కేంద్రాలకు రావడంలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, రికార్డులు ఎప్పటికప్పుడు రాయాలని, పిల్లలకు మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. ఇప్పటి వరకు 20 అంగన్‌వాడీ కేంద్రాలలో వంటపాత్రలు పంపిణీ చేశామని, మిగతా కేంద్రాలలో త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు.

స్వచ్ఛ్భారత్‌కు సంపూర్ణ సహకారం
గంట్యాడ, అక్టోబర్ 12: స్వచ్ఛ్భారత్‌కి సంపూర్ణ సహకారాన్ని అందించడం ద్వారా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని డ్వాక్రా సంఘాల మహిళలు మండలంలోని అన్ని గ్రామాలలోనూ గురువారం ర్యాలీలు, ప్రతిజ్ఞను నిర్వహించారు. గంట్యాడలో గ్రామసర్పంచ్ రఘుమండ లక్ష్మి వెలుగు సిసిల ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళలు స్వచ్ఛ్భారత్‌కు సహకరిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడం ద్వారా గ్రామాన్ని ఒడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పురవీధులలో నినాదాలు చేస్తూర్యాలీ నిర్వహించారు. పెంటశ్రీరాంపురంలో ఎంపిపి దేవుడమ్మ, లక్కిడాంలో జెడ్పీటిసి రమేష్‌కుమార్, బుడతనాపల్లిలో వైస్ ఎంపిపి రంధిరామునాయుడు ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో డ్వాక్రా మహిళలు నిర్వహించిన స్వచ్ఛ్భారత్ ర్యాలీలో వెలుగు ఎపిఎం, సిసిలు పాల్గొన్నారు.

అతివల భాగస్వామ్యంతోనే
అభివృద్ధి సాధ్యం
గజపతినగరం, అక్టోబర్ 12: మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మండల ప్రత్యేక అధికారి, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఆశాదేవి అన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ పల్లె స్వచ్ఛంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఒక్కొక్క గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు వందమంది లబ్దిదారులలో మరుగుదొడ్లు నిర్మాణంపై చైతన్యం తీసుకువచ్చి నిర్మించుకోవడంతోపాటు వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్వాక్రా స్వయం సహాయక సంఘాల సభ్యులు దీనిని ఒక ఉద్యమంలా నిర్వహించాలన్నారు. ముందుగా గ్రామైఖ్య సంఘాల అధ్యక్షులు మరుగుదొడ్లు నిర్మించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఆరుబయట మలవిసర్జన వలన కలిగే అనర్థాలను గ్రామాలలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు తెలియజేసి మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ సభ్యురాలు తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించుకుంటేనే ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలు అందుతాయని చెప్పారు. గ్రామైఖ్య సంఘ అధ్యక్షులు బాధ్యతతో పనిచేయాలన్నారు. తాను గ్రామాలలో ఆకస్మిక తనిఖీలు చేపడతానని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం పలు నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ జరిపారు. మానవహారం చేపట్టి మహిళలచేత స్వచ్ఛ్భారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వెలుగు ప్రాంతీయ సమన్వయకర్త బంగారమ్మ, ఎపిఎం ఆర్.శ్రీనివాసరావు, మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

‘తారురోడ్డు ఉన్న గ్రామాల్లో బస్సు నడపాలి
* ఆర్టీసీ పరిరక్షణకు సంతకాల సేకరణ
గజపతినగరం, అక్టోబర్ 12: తారురోడ్డు ఉన్న ప్రతీగ్రామానికీ ఆర్టీసీ బస్సు నడపాలని ఎన్‌డబ్ల్యుఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.రాములు, ఎ.చంద్రయ్య డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ పరిరక్షణలో భాగంగా సంతకాల సేకరణకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ చేయడమే కాకుండా ఆర్టీసీ పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కరపత్రాలు పంపిణీ చేశారు. ఆర్టీసీని ప్రజలకు దూరం చేసే 2017 మోటార్ వెహికల్ చట్టాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు పెంచడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అద్దెబస్సులను దశలవారీగా రద్దుచేసి ఆర్టీసీ బస్సులు వేయడంతోపాటు కొనసాగించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రద్దుచేసిన ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించడంతోపాటు కొత్తగా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయాలని అన్నారు. ఆర్టీసీని ప్రజాసేవా సంస్థగా గుర్తించి ట్యాక్స్ హాలీడేగా ప్రకటించాలని కోరారు. పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చి పన్నులు తగ్గించాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్ నాయకుడు పురం అప్పారావు, రైతు సంఘం నాయకులు డి.జగన్, బిల్డింగ్ వర్కర్స్‌యూనియన్ నాయకులు జగదీష్, ఎన్‌డబ్ల్యు ఎఫ్ నాయకులు ఎ.ఎస్.నారాయణ, కె.ఆర్.కుమార్, డి.ఎస్.రావు పాల్గొన్నారు.

బాణాసంచా అమ్మకంలో నిబంధనలు పాటించాలి
* ఎఎస్పీ అమిత్ బర్దర్
పార్వతీపురం, అక్టోబర్ 12: ఈనెల 19వ తేదీన దీపావళి పండగకు బాణాస ంచా అమ్మకాలు జరిపే వ్యాపారులు ని బంధనలు తప్పనిసరిగా పాటించాలని పార్వతీపురం ఎఎస్పీ అమిత్ బర్దర్ సూ చించారు. గురువారం తన కార్యాలయ ంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మకాలు జరిపే దుకాణాలు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని, భద్రతా చర్యలుతీసుకోవాలని ఆదేశించారు. అగ్నిమాపక కేంద్రం అధికారుల అనుమతిని తీసుకుని అగ్నిప్రమాదాలకు తావులేకుండా వ్యాపారు లు సామగ్రి నిల్వలు చేసే ప్రమాదాల్లో జాగ్రత్తలు వహించాలన్నారు. ఆప్రాంతాల్లో గ్యాస్ ఎక్స్‌టెంట్ విషర్లు ఏర్పా టు చేసుకోవాలన్నారు. గత ఏడాది త యారుచేసిన బాణాసంచా సామగ్రిని ఈ ఏడాది అమ్మకాలు సాగించవద్దని హెచ్చరించారు. పాత సామగ్రిని అమ్మకాలకు అనుమతులు లేవన్నారు. చైనా నుండి దిగుమతి చేసుకునే బాణసంచా ను అమ్మకాలు చేస్తే చర్యలు తప్పవని ఎఎస్పీ తెలిపారు. చిన్నపిల్లలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్న, పెద్దాతేడా లేకుండా బాణసంచా ను కాల్చినపుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీపేలుడు సామగ్రిని కాల్పడానికి అవకాశం ఇవ్వరాదన్నారు. మె యిన్‌రోడ్డుపై బాణసంచాను కాల్చరాదని, దీనివల్ల వాహనచోదకులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అనుమతులు లేకుండా అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
పట్టణంలో సిసి కెమేరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వీటిని ఏర్పాటు ద్వారా ట్రాఫిక్, జనరల్ మోనటరింగ్ సమస్యలు పర్యవేక్షించడానికి వీలు కలుగుతుందన్నారు. నేర విషయాలపై పరిశీలనకి దోహదపడతాయని ఎఎస్పీ తెలిపారు. పెట్రోబంకుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి హెల్మెట్‌లు లేని వారికి పెట్రోల్ అమ్మకాలు జరపవద్దని సూచించామన్నారు. వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్‌లు వినియోగించి ప్రమాదాలకు తావులేకుండా సహకరించాలని ఎఎస్పీ విజ్ఞప్తి చేశారు.