విజయనగరం

ముందస్తు ఎన్నికలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 17: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు సంకేతాలు ఇవ్వడంతో నేతలు అందుకు తగ్గట్టుగా కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. టిడిపి గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు సభ్యత్వ నమోదు, ఓటర్లను కలుసుకోవడం, సంస్థాగత ఎన్నికలు చేపట్టడం, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ప్రచారం కార్యక్రమాలు చేస్తోంది. ఇంటింటికీ తెలుగుదేశం పేరిట గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం, ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. మరోపక్క సభ్యత్వ నమోదు చేపడుతున్నారు. మున్సిపల్ ప్రాంతాలు, మండలాలు, గ్రామాల్లో పార్టీ కార్యక్రమాల గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. నేతలంతా గ్రామాలు, మండలాల్లో కలియతిరుగుతున్నారు. ఈవిధంగా ప్రజలకు దగ్గరయ్యేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇక వైకాపా నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయడం, బూత్ కమిటీల ఏర్పాటులో నేతలు నిమగ్నమయ్యారు. విపక్ష నేత జగన్ కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలకు అప్రమత్తం చేశారు. దీంతో వైఎస్సార్ కుటుంబం పేరిట సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేస్తున్నారు. సభ్యత్వ నమోదుతోపాటు బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.