విజయనగరం

రైతుబజారు ఏర్పాటుకు స్థలం కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, అక్టోబర్ 17: కొత్తవలసలో రైతు బజారు ఏర్పాటు చేసేందుకు స్థలం కొరతగా ఉందని జిల్లా పరిషత్ సిఇఒ ఎస్.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన ఎంపిడి ఒ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రైతు బజారు ఏర్పాటుకు పలుమార్లు దరఖాస్తులు వచ్చాయని, స్థల సమస్యవలన ఏర్పాటు కాలేదన్నారు. జిల్లా పరిషత్ స్థలంలో ప్రస్తుతం మార్కెట్ కొనసాగుతుందని, ఆ స్థలంలో రైతుబజారు ఏర్పాటుకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. మరేదైనా స్థలం అందుబాటులో ఉంటే రైతుబజారు ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. జిల్లా పరిషత్‌కు షాపింగ్ కాంప్లెక్స్ అద్దెబకాయిలు పూర్తిగా వసూలు చేసి జమచేయాలని ఎంపిడిఒకు సూచించారు. జిల్లా పరిషత్ కల్యాణమండపానికి మరమ్మతుల నిమిత్తం ఐదు లక్షల రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించామని అందుకు తగ్గట్టుగా అధికారులు పనిచేసి స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.
ఇప్పటి వరకు నిర్మించిన మరుగుదొడ్లుకు ఉపాధి హామీ, స్వచ్ఛ్భారత్ మిషన్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నామని,పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లిస్తామని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించిన ఇంటిపన్నులు పూర్తిగా వసూలు చేసి వెంటనే జమచేయాలని అన్నారు. ప్రతి ఇంటికి జియోట్యాగ్ చేసి పన్నులు విధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.