విజయనగరం

వర్షంతో పంట పొలాలను వీడని నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్), అక్టోబర్ 20: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ఫపీడనం, వాయుగుండం ప్రభావంతో పార్వతీపురం ప్రాంతంలో గురువారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. రాత్రంతా తెరిపి లేకుండా కురిసిన వర్షానికి పంటపొలాలతో పాటు, లోతట్టు ప్రాంతాలలో నీరు చేరింది. కొన్ని ప్రాంతాలలో వరి పంటలు పండే దశకు వచ్చాయి. ఈ తరుణంలో తుపాను అంటే దాదాపు ఆయా పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు. కొన్ని చేలు వెన్ను వేసే సమయంలో ఉన్నాయని, వాటి పువ్వు రాలిపోవడం, తెగుళ్లతో గింజలూరకపోవడం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. ఇక కూరగాయల పొలాల్లో నీరు చేరిందని, నీరు పొలాలను వీడడం లేదని రైతులంటున్నారు. ఈ తుపానులు ఇలాగే కొనసాగితే నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు.