విజయనగరం

సాహసమే లక్ష్యంగా పోలీసు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 23: పోలీసు కళాశాలలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు వివిధ రంగాల్లో శిక్షణనందిస్తున్నారు. మహిళల్లో ఆత్మస్థయిర్యం పెంపొందించేందుకు కరాటేలో శిక్షణనిస్తున్నారు. దానివల్ల విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే ధైర్యంగా ఎదుర్కొనే విధంగా వారికి తర్ఫీదునిస్తున్నారు. దాంతోపాటు ఈతలో కూడా శిక్షణనిస్తున్నారు. తొలిసారిగా ట్రైనీలందరికీ ఈత నేర్పించడం ఇదే తొలిసారి. కర్నూలులో వరదల సమయంలో ప్రయాణికులతో ఉన్న బస్సు నీట మునగడంతో అప్పట్లో చుట్టూ పోలీసులు ఉన్నప్పటికీ ఈత తెలియకపోవడంతో వారెవరు వాగులో దిగేందుకు సాహసించలేదు. చివరకు ఓ హెడ్‌కానిస్టేబుల్ ఒక్కరే వారిని రక్షించగలిగారు. దానిని దృష్టిలో పెట్టుకొని డిజిపి సాంబశివరావు ఈ దఫా ట్రైనీలందరికీ ఈత నేర్పించడం తప్పనిసరి చేశారు. ఇక ట్రైనీలుగా ఉంటూనే నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. మరోపక్క సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కంప్యూటర్ పరిజ్ఞానం కల్పిస్తున్నారు. పోలీసు చట్టాలతోపాటు పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో మహిళలకు, పురుషులకు తర్ఫీదునివ్వడం ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క ఎకె 47, పాయింట్ 303, పిస్టల్ తదితర వాటిని ఫైరింగ్ చేయడంలో కూడా మహిళా కానిస్టేబుళ్లకు తర్ఫీదునివ్వడం గమనార్హం. ఇక్కడ పిటిసి ప్రిన్సిపల్ రాజశిఖామణి చొరవతొ నెల్లిమర్లలోని ఫైరింగ్ రేంజి, ట్రక్కింగ్, యోగ, ఇండోర్ ఫైరింగ్ తదితర సౌకర్యాలను కల్పించారు. మరొపక్క సిబ్బందికి కఠినమైన శిక్షణనివ్వడంలో ఆయన నిష్ణాతులు కావడంతో ట్రైనీలను సర్వతోముఖంగా తీర్చిదిద్దుతున్నారు.

పైపులైన్ లీకులతో తాగునీటికి ఇబ్బందులు

గజపతినగరం, నవంబర్ 23: స్థానిక మేజరు పంచాయితీ గజపతినగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించిన పైపులైన్లు శిథిలావస్థకు చేరుకుని ఎక్కడికక్కడ లీకులు ఎక్కువ అవడంతో తాగునీటికి పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్లు వేసి ఏళ్లుగడవడంతో వాటిని ఆరు నెలల కిందటే ఒక గుత్తేదారుడుకు కొత్తపనులు చేయడానికి సాక్షాత్తూ ఎమ్మెల్యే కె. ఎ.నాయుడు పనులు చేయడం జరిగింది. సుమారు పది లక్షల రూపాయలతో గణేష్ కోవెల, బూర్లివీధి, ఠాణావీధులలో కొత్తపైపులైన్లను వేయడం జరిగింది. కొత్తపైపులైన్లు వేసిన మినహా మిగిలినచోట్ల పాతపైపులైనే్ల కొనసాగించడంతో అక్కడ పరిస్థితి మొదటికివచ్చి లీకులై తాగునీరు రోడ్డుమీదకు చేరుతున్నది. అలాగే లీకులు అయినచోట నీరు కలుషితం అవుతూ కుళాయిల ద్వారా పురుగులు, మట్టినీరు సరఫరా అవుతున్నదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా జయంతి కాలనీ, కుమ్మరివీధి కోనేటిగట్టు వీధులకు కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో అనేక ఏళ్లగా వీరు తాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టణంలో వందశాతం తాగునీటి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వాగ్దానం చేసి ఏడాది అయినా ఇంతవరకు సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదు. ప్రభుత్వం ఇంటింటికి కుళాయిలు ఇస్తామని పదేపదే చెబుతున్నదని, ఇంటింటికి కాదుకదా వీధి కుళాయి అయినా నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో పరిస్థితి లేదని పట్టణవాసులు అంటున్నారు.