విజయనగరం

ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయటమే చంద్రబాబు లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 21: ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ అధికారం చేపట్టాలనే ఆశతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. ఇప్పుడు తనకు అధికారం, ఆ తరువాత తన కుమారుడికి అధికారం అనే ధోరణితో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గురువారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు గతంలో అధికారంలోకి రావటానికి మెజారిటీ తక్కువగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులు జరిగేవని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నా దిగజారుడుతనంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపారు. ఫిరాయింపులకు అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టడం శోచనీయమని అన్నారు. పార్టీ ఫిరాయిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యేలు చెప్పటం గమనిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉద్ధేశ్యపూర్వకంగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు. రెండేళ్లలో అభివృద్ధి, రాజధాని నిర్మాణ కార్యక్రమాల పేరిట దోచుకని దాచిన డబ్బును ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఖర్చు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఖర్చు చేసిన డబ్బును రాష్ట్భ్రావృద్ధికి వెచ్చిస్తే రాష్ట్రం కొంతైనా మెరుగుపడేదని అన్నారు. పించారు. ఎన్నికల సమయంలో అధికారం కోసం చంద్రబాబునాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మరచిపోయారని ఎద్దేవా చేసారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తదితర సమస్యలను ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ ఈనెల 25న ఢిల్లీకి వెళ్లి రాష్టప్రతికి విజ్ఞాపన అందచేయాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 23న జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.