విజయనగరం

సోలార్ విద్యుత్ వినియోగంలో జిల్లా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 11: రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగంలో జిల్లా ముందంజలో ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 47 గ్రామాల్లో సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఎల్‌ఇడి బల్బులతో మరికొంత విద్యుత్‌ను ఆదా చేస్తున్నారు. ఇదిలా ఉండగా దశల వారీగా ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ వినియోగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతోపాటు రైతులకు కూడా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీనిచ్చి ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, రైతులు సోలార్ విద్యుత్ వాడకంలో ముందంజలో ఉన్నారు. ఈ విధంగా జిల్లాలో ఇటీవల కాలంలో సోలార్ విద్యుత్ వాడకం పెరిగింది.
ఇదిలాఉండగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కూడా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు ఎంపి ల్యాడ్స్ ద్వారా విరివిగా నిధులు మంజూరు చేస్తున్నారు. దాంతోపాటు ఆయా శాఖలు కూడా నిధులను సమీకరించి సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. జిల్లాలో విజయనగరం మున్సిపాల్టీ ఆధ్వర్యంలో 4000 యూనిట్లు ఉత్పత్తి చేయగల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ద్వారపూడిలో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో 80 కిలోవాట్ల సోలార్ విద్యుత్, జిల్లా పరిషత్‌లో 30 కిలో వాట్లు, బొబ్బిలి మున్సిపాల్టీలో 150 కిలో వాట్లు, విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో 55 కిలోవాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడస్తున్న 43 పాఠశాలలకు ఎంపి ల్యాడ్స్‌తో సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.
మహారాజ ఆటానమస్ కళాశాలలో 50 కిలోవాట్లు, మహారాజా మహిళా కళాశాలలో 50 కిలోవాట్లు, మహారాజ పిజి కళాశాలలో 150 కిలోవాట్లు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎన్‌టిఆర్ జలసిరి కింద 1659 సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ ఏడాది మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో పార్వతీపురం మున్సిపాల్టీకి 700 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 300 కిలోవాట్లు, ఘోషాసుపత్రిలో 150 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ముడుపులు ఇచ్చిన వారికే ఎన్‌టి ఆర్ గృహాలు..
* అర్హులకు మొండిచేయి
సాలూరు, డిసెంబర్ 11: రాష్ట్రంలో ఎన్‌టి ఆర్ గృహనిర్మాణాలు ముడుపులు ఇచ్చిన వారికే టీడీపీ నాయకులు ఇళ్లు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని టీడీపీ నాయకులు చెప్పడం అవాస్తవమన్నారు. డబ్బులు ఇచ్చినవారికే ఇళ్లు మంజూరు చేస్తున్నారని తన వద్ద ఆదారాలున్నాయన్నారు. అర్హులకే ఇళ్లు మంజూరుచేశామని టీడీపీ నాయకులు నిరూపించాలని సవాలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజకీయాలకు అతీతంగా సంతృప్తికరంగా ఇళ్లు మంజూరయ్యాయన్నారు. పట్టణంలోని పేద హరిజనపేటకు చెందిన పెద్దపల్లి కృష్ణ వైసీపీ అభిమాని అనే కారణంతో ఇళ్లు మంజూరుచేయలేదన్నారు. ఎన్‌టిఆర్ గృహాల పేరుతో అధికార పార్టీ నాయకులు దోపీడీ చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇళ్లులేని నిరుపేదలెందరో ఉన్నారని, అయినప్పటికీ ఎవరికీ మంజూరుకావడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.