విజయనగరం

వ్యవసాయాధారిత పరిశ్రమలపై మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 12: జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఇటీవల కాలంలో సింగిల్ విండో విధానం ద్వారా జిల్లాలో బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో కోస్టల్ ఆగ్రో ఫుడ్స్, వీఎన్‌ఆర్‌డీ ఇండస్ట్రీస్, విఆర్‌డి ఇండస్ట్రీస్ కంపెనీలు చాక్లెట్‌లను ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. చీపురుపల్లిలోని బిపి వరకట్టు దగ్గర నార్త్ కోస్తల్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్‌పార్కు నెలకొల్పేందుకు మరో పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చారన్నారు. బొండపల్లి మండలం మరుపల్లిలో చందన డైయిరీ ఏర్పాటు చేసేందుకు వైటీవీ ఎండీ ముందుకు వచ్చారన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఇ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ చెప్పారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో వంద ఎకరాలు సేకరించామన్నారు. వీటిలో విజయనగరం నియోజకవర్గంలోని గుంకలాం, నెల్లిమర్ల నియోజకవర్గంలో కందివలస, గజపతినగరంలో మరుపల్లి, ఎస్.కోట నియోజకవర్గంలో బలిఘట్టం ప్రాంతాల్లో భూమి సిద్ధంగా ఉందన్నారు. బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి,కురుపాం నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్‌ఎంఇ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
త్వరలో పది పరిశ్రమల ఏర్పాటు
జిల్లాలో మరో ఆరు నెలల్లో కొత్తగా ఏడు మెగా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. సుమారు రూ.625 కోట్లతో ఈ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. వాటిలో బోగాపురంలోని రూ.33 కోట్లతో కెమిరా ఇండస్ లిమిటెడ్, రూ.100 కోట్లతో బొబ్బిలిలోని కార్బన్ రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ రెండు యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. అలాగే రూ.50కోట్లతో గరివిడిలో మెసెర్స్ రిచ్‌మండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు కానుందన్నారు. ఇదిలా ఉండగా ఎల్‌కోటలోని మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రాజెక్టు రూ.80కోట్లతో ఆ ప్రాజెక్టును విస్తరించనుందన్నారు. ఎల్‌కోటలోని శ్రీరాంపురంలో రూ.330.7 కోట్లతో సింహాద్రి పిల్లెట్స్ ఇండియా లిమిటెడ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుందన్నారు.