విజయనగరం

భద్రత పట్టని ‘మైనింగ్’లపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, డిసెంబర్ 12: భద్రతాప్రమాణాలు పాటించని మైనింగ్ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని రాష్ట్ర గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు హెచ్చరించారు. బొబ్బిలి మండలం బంకురువానివలసలో మాంగనీస్ క్వారీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులను మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు పరిశీలించిన అనంతరం ప్రమాదానికి గల కారణాలను యాజమాన్యం ద్వారా అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గనులకు సంబందించి భద్రతా ప్రమాణాలపై రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఈనెల 14న అమరావతిలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. బంకురువానివలస మైనింగ్‌లో నిర్ణీత భద్రతాప్రమాణాలను పాటించలేదని విచారణలో నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రమాదంలో మృతిచెందిన బంకురువానివలస గ్రామానికి చెందిన మరడాన వెంకటరావు, లోపింటి అంజయ్యల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కుటుంబానికి చంద్రన్నబీమా, కార్మిక చట్టం ప్రకారం యాజమాన్యం ద్వారా నష్టపరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్‌లో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వివేక్‌యాదవ్, ఆర్డీఓ బి సుదర్శనదొర, బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత పాల్గొన్నారు.