విజయనగరం

ఆనందలహరి అభ్యసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగవరపుకోట, డిసెంబర్ 14: మండలంలోని మూలబొడ్డవర పంచాయితీ చీడిపాలెం గ్రామంలో ఆనందలహరి అభ్యసన కార్యక్రమం ఎం ఇ ఒ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపిపి రెడ్డి వెంకన్న, జడ్పీసి రామలక్ష్మిలు గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎం ఇ ఒ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాబోధన వినూత్న పద్ధతిలో విద్యార్థులు అభ్యసించాలని ఈ ఆనందలహరి అభ్యసన కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ట్యాబ్‌లు, వివిధ చిత్రాలు, ప్లేకార్డులు, వీడియోలు ద్వారా వినోదం కలిగించే రీతిలో బోధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. గతంలో జిల్లాలో బొబ్బిలి, విజయనగరంలో మాత్రమే ఈ కేంద్రాలు ప్రారంభించారని, ఈ ఏడాది మండానికి రెండు చొప్పున ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఎస్.కోట మండలంలో వసీ, చీడిపాలెం గ్రామాలలో లక్షా 50వేల విలువగల బోధనా పరికరాలతో కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. ఈ ఏడాది ఒకటి, రెండు తరగతులను మాత్రమే ఈ పద్ధతిలో బోధించడం జరుగుతుందని, వచ్చే ఏడాది మూడవ తరగతికి అలా పెంచడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

జిల్లా ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ, సిటీస్కాన్ ఏర్పాటు
* వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 14: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఎంఐఆర్, సిటి స్కాన్ సౌకర్యం కల్పిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. వీటిని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే టెండర్లను పిలిచామని చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే వీటిని రోగులకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించి బలోపేతం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కోసం ఎ.వి.టిస్టులా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కిడ్నీవ్యాధిగ్రస్తులకు మొట్టమొదటిసారిగా డయాలసిస్ చేసేటప్పుడు ఎ.వి.టిస్టులా కోసం విశాఖపట్టణం తరలిస్తున్నారని, ఇక నుంచి జిల్లా ఆసుపత్రిలోనే ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్, ఇతర వైద్యులు ఉన్నారని, వీరికి శిక్షణ అందించి ఎ.వి.టిస్టులా సేవలను నెలరోజులలో అందుబాటులోకి తీసుకురావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జాయింట్‌కలెక్టర్-2 కె.నాగేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ విఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.