విజయనగరం

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జనవరి 20: పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో పలు విభాగాల అధికారులు, ఉద్యోగులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన వినతులు, ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా పట్టణంలో ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పట్టణంలో 56 వేల అసెస్‌మెంట్లు ఉన్నాయని, ఏరియర్స్‌తో కలిపి 34 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలు చేయవలసి ఉందని తెలిపారు. మొండిబకాయిదారులకు రెడ్‌నోటీసులను జారీ చేయాలని, ఇందుకు మూడువేల మందికి రెడ్‌నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ గ్రీవెన్స్, ఆడిట్, బడ్జెట్, ఆస్తిపన్ను వసూళ్లు తదితర వాటిపై సమీక్షించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌మేనేజర్ డి.అనందరావు, మున్సిపల్ అసిస్టెంట్ సిటీప్లానర్ వి.శోభన్‌భాబు, మున్సిపల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ అకౌంట్స్ అధికారి రోజా వెంకటలక్ష్మి, మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు శంకరరావు, వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఉద్యోగులు విశోద్, సాయిప్రసాద్ పాల్గొన్నారు.
ప్యాకింగ్ హౌస్‌ల పరిశీలన
జామి, జనవరి 20: మండలంలోని నిర్మిస్తున్న మామిడి ప్యాకింగ్ హౌస్‌లను ఉద్యానవనశాఖ డిడి లక్ష్మీనారాయణ శనివారం పరిశీలించారు. మండలంలోని కిర్ల, అలమండ గ్రామాలకు చెందిన మామిడి తోటల్లో నిర్మించిన ప్యాకింగ్ హౌస్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు లక్షల నిధులతో నిర్మించిన ఈ ఒక్కొక్క హౌస్‌కు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు సబ్సిడీని అందిస్తున్నామని తెలిపారు. ఈ హౌస్‌ల ద్వారా మామిడి ప్యాకింగ్ సక్రమంగా చేసుకోవడమేకాకుండా ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.