విజయనగరం

ఇంటర్ పరీక్షలు పక్కాగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, జనవరి 20: ఇంటర్మీడియట్ పరీక్షలు పక్కాగా, ప్రశాంతంగా నిర్వహించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీషా ప్రిన్సిపాళ్లను, అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర సమావేశ మందిరం హాల్‌లో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని వివిధ గిరిజన గురుకుల కళాశాలలతో పాటు డివిజన్‌లోని వివిధ ప్రభుత్వజూనియర్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతోను, ఇతర అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలకు విద్యార్థులకు యూనిఫారంలు వేసుకుని రాకుండా చూడాలని, కేవలం సివిల్ డ్రెస్‌లతో వచ్చిన వారిని మాత్రమే పరీక్షాకేంద్రానికి అనుమతించాలని పీవో ఆదేశించారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే పరీక్షాకేంద్రాల వద్ద వైద్యసదుపాయం ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ డీఎం హెచ్‌వోను ఆదేశించారు. పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు సెల్‌ఫోన్లు, టాబ్స్ వంటివి అనుమతించరాదన్నారు. పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు తప్ప ఇతరులెవరినీ అనుమతించరాదని పీవో సూచించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వాహకులు మాట్లాడుతూ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఇతర అంశాలపై తప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పీవో దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయమై పార్వతీపురం ఏఎస్పీ పి.దీపిక మాట్లాడుతూ తప్పుడు సమాచారం అందించిన వారి ఫోన్ల నెంబర్లను తమకు అందిస్తే తక్షణమే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రోబ్లమేటిక్ పరీక్షా కేంద్రాల వద్ద మరింత అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఇనస్పెక్టింగ్ ఆఫీసర్ ఎ.విజయలక్ష్మి మాట్లాడుతూ ఈనెల 27న ఎథిక్స్ అండ్ హూమన్ వాల్యూషన్ ఎగ్జామినేషన్ ఉదయం 10గంటల నుండి 1గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే అలాగే ఎన్విరాన్‌మెంటల్ ఎగ్జామినేషన్ ఈనెల 29వ తేదీన అదే సమయానికి జరుగుతుందన్నారు. అలాగే బైపిసి, ఎంపిసి అభ్యర్థులకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పరీక్షలు వచ్చేనెల 1వ తేదీ నుండి 21వ తేదీ వరకు జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే థియరీ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 19వరకు జరుగుతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రిన్సిపాళ్లతో పాటు గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఒయస్‌డి టి.కమల్‌భరత్ తదితరులు పాల్గొన్నారు.