విజయనగరం

మూడు నెలల్లో పనులు పూర్తయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 25: పట్టణంలో రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రోడ్లు, కాలువలు, కల్వర్టుల నిర్మాణం తదితర అభివృద్ధిపనులను మూడునెలలలో పూర్తిచేస్తామని మున్సిపల్ యంత్రాంగం ప్రకటించింది. గత రెండేళ్ల నుంచి కాలయాపన జరిగిన పనులను మూడునెలలలో ఏలా పూర్తిచేస్తారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒకవైపు ఎండల తీవ్రత...మరోవైపునీటి కొరత... ఇంకొవైపుకూలీలు సమస్యలు వేధించడంతో సకాలంలో పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మండుతున్న ఎండల ప్రభావంతో పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడంలేదు. దీంతో పనులు ఏలా ప్రారంభించాలోనని కాంట్రాక్టర్లు సతమతమవుతున్నారు. అయితే మూడునెలలలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని, అవసరమైతే డిపాజిట్ సొమ్మును స్వాధీనం చేసుకుంటామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ చేసిన హెచ్చరికలతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 25.61 కోట్ల రూపాయలతో 355 పనులు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేశారు. అయితే ఇందులో 15.98 కోట్ల రూపాయల విలువైన 242 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనరల్ ఫండ్స్ కింద కేటాయించిన 15.69 కోట్ల రూపాయలతో 208 పనులు చేపట్టాలని ప్రతిపాదించగా, ఇంతవరకు 2.75 కోట్లతో 34 పనులు పూర్తి చేయగా, 3.29 కోట్ల రూపాయల విలువైన 27 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇంకా 8.72 కోట్ల రూపాయల విలువైన 122 పనులు ప్రారంభం కాకపోగా, 92.75లక్షల రూపాయల విలువైన 25 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. అలాగే 2016-2017 సంవత్సరానికి సంబంధించి జనరల్ ఫండ్స్ కింద కేటాయించిన 2.12 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన 18 పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ఈ పనులు సకాలంలో ప్రారంభం కాకపోవడం వల్ల నిర్మాణవ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా 2013-2014 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాన్‌ప్లాన్ గ్రాంటు కింద 2.59 కోట్ల రూపాయలతో 19 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 64.10 లక్షల రూపాయలతో ఒక పని కూడా పూర్తి కాలేదు. ఐదు పనులు ప్రగతిలో ఉన్నాయి. మిగతా 136.49 లక్షల రూపాయల విలువైన 14 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే నాన్‌ప్లాన్ మెయింటెనెన్స్ కింద 2014-205 సంవత్సరానికి సంబంధించిన 1.15 కోట్ల రూపాయలతో 13 పనులు చేపట్టాలని ప్రతిపాదించగా 42.70 లక్షల రూపాయలతో నాలుగు పనులను పూర్తి చేశారు. ఇంకా 73.05లక్షల రూపాయల విలువైన తొమ్మిది పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్‌ఎఫ్‌సి 2014-2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.39 కోట్ల రూపాయలతో 30 పనులు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేయగా, 12.40లక్షల రూపాయతో రెండులను పూర్తి చేయగా, మరో 18.10లక్షల రూపాయల విలువైన రెండు పనులు ప్రగతిలో ఉన్నాయి. మిగతా 109.06 లక్షల రూపాయల విలువైన 26 పనులు ప్రారంభం కాలేదు. నాన్ ప్లాన్ గ్రాంటు కింద 2.44 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన 44 పనులలో ఇంకా తొమ్మిది పనులు ప్రారంభం కాలేదు. నాన్ ప్లాన్ గ్రాంటు ఎస్‌సిఎస్‌పి 2013-2014 సంవత్సరంలో 79.32 లక్షల రూపాయలతో 23 పనులు చేయాలని నిర్ణయించగా 35.92 లక్షలతో కేవలం నాలుగు పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 43.40 లక్షల రూపాయల విలువైన 19 పనులను ప్రారంభించలేదు. ఈ కారణంగానే పట్టణ అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ నేపధ్యంలో పనుల జాప్యంపై ఒకవైపుకలెక్టర్ ఎంఎం నాయక్, ఎమ్మెల్యే మీసాల గీత సీరియస్ కావడంతో పనులపై కదలిక వచ్చింది. ఇదేవిషయమై మూడురోజుల క్రితం నిర్వహించిన పట్టణ అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులపై కేంద్రమంత్రి పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు మండిపడ్డారు. దీంతో మూడునెలలోగా పనులు పూర్తిచేయాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు వర్కు ఆర్డర్లు ఇచ్చిన కాంట్రాక్టర్లందరికీ మూడునెలలలో పనులు పూర్తి చేయాలని హుకుం జారీ చేసింది.

ఎసిబి వలలో
అటవీ అధికారి
శృంగవరపుకోట, ఏప్రిల్ 25: విశాఖ జిల్లా బొర్రా గ్రామంలో అటవీశాఖ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న శోభాసుబ్బారావు సోమవారం ఎసిబి వలలో చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బొర్రాగ్రామానికి చెందిన ప్రసాదరావు అనే ఉపాధ్యాయుడు తన ఇంటి పెరడులో ఉన్న నాలుగు టేకు చెట్లు అవసరం నిమిత్తం రెండ్లు చెట్లు నరికి గృహ నిర్మాణానికి ఉపయోగించుకున్నారు. అదే గ్రామంలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న శోభా సుబ్బారావుకు ఈ విషయం తెలిసింది. వెంటనే ఉపాధ్యాయునితో ఫారెస్ట్ అధికారి సుబ్బారావు అనధికారికంగా టేకుచెట్లు కొట్టినందుకు కేసు పెడతామని బెదిరించారు. కేసు నమోదుచేయకుండా ఉండాలంటే 25వేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసాడు. ఇరువురి మధ్య 11వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. అయితే ఉపాధ్యాయుడు ప్రసాదరావు బొర్రా గ్రామం వద్ద రెండు వేల రూపాయలు చెల్లించాడు. మిగిలిన తొమ్మిది వేల రూపాయలు ఎస్.కోటలో నివాసం ఉంటున్న శోభాసుబ్బారావు ఇంటికి సోమవారం తీసుకువచ్చి ఇస్తుండగా సమాచారం అందుకున్న ఎసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ వల పన్ని లంచం తీసుకుంటున్న సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.