విజయనగరం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), ఫిబ్రవరి 20: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర భూగర్భగనులశాఖామంత్రి ఆర్‌వి సుజయ్‌కృష్ణరంగారావు కోరారు. మండలం పిరిడి గ్రామంలో 32లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పశువైద్య కేంద్ర భవనం, 7లక్షల 50వేల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ప్రధాన సమస్యలను తమ దృస్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పశువైద్య కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పిరిడి పశువైద్యకేంద్రానికి మంచి గుర్తింపు ఉందని వాటిని అధికారులు నిలబెట్టుకోవాలన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని పిల్లలు వినియోగించుకునే విధంగా కృషి చేయాలన్నారు. విధిగా అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచి పిల్లలకు చక్కని పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అలాగే చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పశువైద్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గాలికుంటు వ్యాధి నిరోదక టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ వై సింహాచలం, ఐసీడీఎస్ పీడీ రాబర్ట్, పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి సుదర్శనదొర, టీడీపీ సీనియర్ నాయకులు తూముల భాస్కరరావు, మాజీ ఎంపీపీ తమ్మిరెడ్డి దామోదరరావు, జడ్పీటీసీ గౌరమ్మ, సర్పంచ్ సుబ్బలక్ష్మి, టీడీపీ నాయకులు గోర్జి శ్రీనివాసరావు, జె ఆర్‌కె రంగారావు, గర్భాపు పరశురాం, తదితరులు పాల్గొన్నారు.