విజయనగరం

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, ఫిబ్రవరి 23: కేంధ్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అయిదు బడ్జెట్‌లలోరాష్ట్రానికి మొండిచెయ్యి చూపించిందని, ఆఖరి బడ్జెట్‌లోనైనా న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్నామని రాష్ట్ర గనులశాఖా మంత్రి ఆర్‌వి.సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. స్థానిక మెంటాడ వీధిలో ఉన్న కోదండరామ కళ్యాణమండపంలో టిడిపి జిల్లా సమన్వయకమిటీ, పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రంగారావు మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత టిడిపి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమాలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు వైసిపి అడుగడుగునా అడ్డుతగులుతోందని ఆరోపించారు. కేంద్రం నుంచి ఉపాధిహామీ నిధులు రాకుండా ప్రతిపక్ష ఎంపిలు ఫిర్యాదులు చేశారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వీధిదీపాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సిఎం కావాల్సిన అవసరం ఎలా ఉందో 2019 ఎన్నికల్లో కూడా అంతే అవసరం అన్నారు. ప్రత్యేకహోదా విషయంలో బిజేపి రాష్ట్రాన్ని మోసం చేసిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పి ఏడు రాష్ట్రాలకు ప్రత్యేకహోదా రాయితీలను కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రజల కోరికమేరకు హోదాకు టిడిపి కట్టుబడి ఉందన్నారు. సాధించేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీని కేంధ్రం విస్మరించిందన్నారు. ప్రత్యేకహోదా ఏ రాష్ట్రానికి ఇవ్వబోమని చెబితే ప్యాకేజీకి అంగీకరించినట్టు చెప్పారు. ప్రత్యేకహోదా విషయంలో వైసిపితో సహా ఇతర ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తూ ఉంటే చేతగాని వారిలా రాష్ట్ర ప్రజలు ఊరుకోరన్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతున్నారన్నారు. చంద్రబాబు దీని కోరం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు. వ్యక్తిగత అవసరాల కోసం వైసిపి ఎంపిలు కేంధ్ర బడ్జెట్‌ను ప్రసంసిస్తున్నారని చెప్పారు. ప్రత్యేకహోదా కోసం రెండేళ్లక్రితం రాజీనామా చేస్తామని చెప్పిన వైసిపి ఎంపిలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మృణాళిని, జెడ్పి చైర్‌పర్సన్ స్వాతిరాణి, టిడిపి జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, నెలిమర్ల ఎమ్మెల్యే నారాయణస్వామినాయుడు, ఐబిపి రాజు, కరణం శివరామకృష్ణ, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌లు పాల్గొన్నారు.

ఎఎంసి గోదామును ప్రారంభించిన మంత్రి
సాలూరు, ఫిబ్రవరి 23: స్థానిక ఎఎంఎస్ యార్డులో 90 లక్షలతో నిర్మించిన గోదామును రాష్ట్ర భూగర్భ గనుల శాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు శుక్రవారం ప్రారంభించారు. 1500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉన్న గోదామును ఆర్‌ఐడిఎస్ నిధులతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జి.సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్, ఎఎంసి అధ్యక్షులు పిన్నింటి ఈశ్వరరావు, వైస్ చైర్మన్ చొక్కాపు త్రినాథ, మార్కెటింగ్ శాఖ ఎడి శ్రీనివాసరావు, ఎఎంసి కార్యదర్శి రామరాములులు పాల్గొన్నారు.

నగదు కష్టాలను తీర్చాలని దీక్ష
సాలూరు, ఫిబ్రవరి 23: ప్రభుత్వ బ్యాంకుల్లో నగదు కొరత కష్టాలను తీర్చాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజలు ఒక రోజు దీక్ష చేపట్టారు. స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్‌వై.నాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.లక్ష్మి ఆధ్వర్యంలో పేద, మధ్యతరగతి ప్రజలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు వి.లక్ష్మి మాట్లాడుతూ బ్యాంకుల్లో, ఎటిఎంలలో ప్రజలకు అవసరమైనంత నగదు రావడం లేదన్నారు. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలోని పారిశుధ్య సిబ్బంది, సాగునీటి సరఫరా, విద్యుత్ విభాగ సిబ్బంది వేతనాలు బ్యాంకుల్లో నిలిచిపోయాయని తెలిపారు. వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎన్‌డిఎ ప్రభుత్వం పెద్దనోట్లు రద్దుచేసినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయని తెలిపారు. బ్యాంకుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నా సరిపడినంత డబ్బులు దొరకడం లేదన్నారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు వెంకటరావు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.