విజయనగరం

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల ఇంటర్వ్యూ అర్హత జాబితాలో తప్పులు సవరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, మార్చి 13: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో ఆన్‌లైన్ దరఖాస్తుల్లో అనేక తప్పులు జరిగాయని తక్షణమే వీటిని సవరించాలని మైదాన ప్రాంత గిరిజన నిరుద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు రఘుపతుల శశిభూషణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, టైపిస్ట్, కుక్, హెల్పర్ వాచ్‌మెన్ తదితర ఉద్యోగాల బ్యాక్‌లాగ్‌కు సంబంధించి 63 పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్టు సైతం ఇటీవల విడుదల చేశారని ఇందులో అనేక తప్పులు ఉన్నాయని, మెరిట్ లిస్టులో స్పష్టత లేకపోవడం వల్ల దరఖాస్తు చేసిన నిరుద్యోగుల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. మార్కులు గ్రేడింగ్, తీవ్ర వ్యత్యాసాలు ఆన్‌లైన్‌లో కన్పిస్తున్నాయన్నారు. ఏజ్‌బార్, ఎంప్లాయిమెంట్ సీనియారిటీ అభ్యర్థులను పరిగణలోనికి తీసుకోవడం లేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈవిధంగా జరిగిందని శశిభూషణ్ ఆరోపించారు. ఈవిషయంలో కలెక్టర్ చొరవ తీసుకుని తప్పులు సవరించడానికి ఇంటర్వ్యూలు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గిరిజన అర్చకులకు ఆలయాల్లో అవకాశం
పార్వతీపురం, మార్చి 13: గిరిజన గ్రామాల్లో నిర్మిస్తున్న ఆలయాల్లో శిక్షణ పొందిన గిరిజన అర్చకులకు ఆలయ పూజారి బాధ్యతలు అప్పగించడానికి అవకాశాలున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ పరిషత్ ప్రచారకుడు, ప్రత్యేక అధికారి రమణప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో శిక్షణ పొందిన గిరిజన అర్చకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నిర్మిస్తున్న ఆలయాలకు అర్చకులుగా కొనసాగడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరామనవమి, ఉగాది పండగ, శ్రీలలితా శాస్తన్రామాలకు సంబంధించిన పుస్తకాలు అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా హిందూ ధర్మ ప్రచారక్ ఎం.వేణుగోపాల్, పార్వతీపురం డివిజన్ హిందూ ధర్మ ప్రచారక్ నర్సింగరావు, గౌరిశంకర్ నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నాణ్యతలో లోపాలుంటే ఉపేక్షించేది లేదు
పీవో డాక్టర్ లక్ష్మీశ స్పష్టీకరణ
పార్వతీపురం, మార్చి 13: తోటపల్లి పర్యాటక ప్రదేశంలో 25సీట్లు సామర్ధ్యం కలిగిన ఒక పాసింజర్ బోటు నిర్వహణకు మంగళవారం ఐటిడి ఎ కార్యాలయంలోని పీవో ఛాంబర్‌లో టెండర్లను పీవో డాక్టర్ జి.లక్ష్మీశ నిర్వహించారు. బోటు నిర్మాణానికి సంబంధించి ఈనెల 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు టెండర్లను పిలవడం జరిగిందన్నారు. ఈటెండర్లలో పాల్గొన్న ఇద్దరు టెండర్ల దారులతో పాల్గొన్నారు. 25 సీట్లుకలిగిన పాసింజర్ బోటుకు రూ.14లక్షల రూపాయలకు టెండరు దారులు కోరగా పీవో డాక్టర్ లక్ష్మీశ రూ.9లక్షలు కేటాయించారు. దీనికి సంబంధించి విజయనగరానికి చెందిన దుర్గా మాల్టో వర్కుషాపునకు టెండరు ఖరారు చేయడానికి పీవో అంగీకారం వ్యకతం చేశారు. అయితే దీని ఏర్పాటులో ఎలాంటి లోపాలున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టూరిజమ్ అధికారి పి ఎం మోహనరావుజిసిసి డి ఎం భాస్కరరావు, గిరిజన సహకార సంఘం అధ్యక్షుడు తిరుపతి, మత్స్యశాఖ ఇనస్పెక్టర్ మురళీ తదితరులు పాల్గొన్నారు.